శతదినోత్సవాల మాట పూర్తిగా మరిచిపోయిన రోజులివి. అప్పుడప్పుడూ 100 డేస్ పోస్టర్లు కనిపిస్తున్నాయి కానీ.. అందులో జెన్యూన్‌గా వంద రోజులు ఆడిన సినిమాలు చాలా తక్కువే. ఒకవేళ ఇలా ఆడినా ఒకటో రెండో సెంటర్లలో మాత్రమే 100 డేస్ సాధ్యమవుతోంది. ఇలాంటి సమయంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ నాలుగు సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఆ నాలుగు సెంటర్లలోనూ జెన్యూన్‌గానే ఈ సినిమా వంద రోజులు ఆడటం విశేషం. ఒక్క కృష్ణా జిల్లాలోనే ‘సోగ్గాడే..’ రెండు సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది. విజయవాడతో పాటు మచిలీపట్నంలో 100 డేస్ ఆడిందీ సినిమా. వీటితో పాటు గుంటూరు - ఆదోని (కర్నూలు జిల్లా)లోనూ సోగ్గాడే వంద రోజులు ఆడింది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 15న పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సెన్సేషనల్ హిట్టయింది. ఇంకో మూడు సినిమాలతో పోటీ పడి బ్లాక్ బస్టర్ అయింది. 30 రోజుల్లోనే 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అక్కినేని నాగార్జున కెరీర్ లోనే అతి పెద్ద హిట్టుగా నిలిచింది. ఈ సినిమా 110 సెంటర్లలో 50 రోజులు ఆడటం విశేషం. వైజాగ్ ఏరియాలో వరుసగా 12 రోజుల పాటు ప్రతి షో హౌస్ ఫుల్ కావడం కూడా ఓ రికార్డుగా నిలిచింది. చాలా ఏరియాల్లో నాగార్జున కలెక్షన్ల కెరీర్ రికార్డులు బద్దలయ్యాయి. ఉత్తరాంధ్రలో రూ.5 కోట్లు.. తూర్పు గోదావరిలో రూ.3 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం కూడా గొప్ప ఘనతే. ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంద రోజులు పూర్తి చేసుకోవడంపై నాగార్జున స్పందిస్తూ.. ‘‘ఈ ఆనందాన్ని.. ఈ విజయోత్సాహాన్ని.. ప్రేక్షకులకు నా కృతజ్నతను మాటల్లో చెప్పలేను. నా శ్రేయోభిలాషులకు.. అభిమానులకు పెద్ద థ్యాంక్స్’’ అన్నాడు.