లేటుగా వచ్చి దూసుకెళ్తున్నాడు అక్కినేని నాగార్జున. సంక్రాంతికి అతి తక్కువ అంచనాలతో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఇప్పుడు అన్నింటినీ మించి పెద్ద విజయం సాధించేలా కనిపిస్తోంది. తొలి వీకెండ్లో మూడు రోజులూ దుమ్ముదులిపిన ‘సోగ్గాడే..’. వీకెండ్ తర్వాత కూడా జోరు చూపిస్తోంది. నిన్న సోమవారం కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నాగార్జున సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా ‘సోగ్గాడే..’ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపిస్తోంది. బి, సి సెంటర్లలో ప్రస్తుతం మిగతా సంక్రాంతి సినిమాలన్నీ జోరు తగ్గించేయగా.. ‘సోగ్గాడే...’ మాత్రం అనూహ్యమైన వసూళ్లు సాధిస్తోంది.
సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ తర్వాత సేఫ్ బెట్ ‘సోగ్గాడే చిన్నినాయనా’నే. ఎందుకంటే చాలా మినిమం బడ్జెట్ తో తెరకెక్కిందీ సినిమా. నాగ్ సొంత సినిమా కాబట్టి రెమ్యూనరేషన్ లేదు. కొత్త దర్శకుడు కాబట్టి అతడికీ పెద్దగా ఇచ్చింది లేదు. మిగతా కాస్టింగ్ మొత్తానికి అయ్యింది కూడా చాలా తక్కువ. ఇక సినిమా చూస్తే ఏమాత్రం ఖర్చు పెట్టారన్నది అర్థమైపోతుంది. మొత్తంగా చూస్తే పది కోట్ల లోపే సినిమాను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. బయ్యర్లకు కూడా తక్కువకే అమ్మారు. ఐతే తొలి వీకెండ్లోనే ఈ సినిమా రూ.14 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. దీంతో తొలి వారానికే బయ్యర్లు లాభాల్లోకి వచ్చేసే పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాల రేసు పూర్తయ్యే సమయానికి నాగార్జునే విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.