దక్షిణాదితో ఎవరూ ఊహించని కాంబినేషన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి కలయికలో జక్కన్న దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్`ని తెరకెక్కించడం హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఈ చిత్రాన్ని ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేపథ్యంలో రూపొందించడం, స్వాతంత్య్రం కోసం ఫైట్ చేసిన ఇద్దరు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ల కథని ఫిక్షనల్ అంశాల్ని జోడించి తెరకెక్కించడంతో ఈ మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమరం భీం కలిసి బ్రిటీష్ వారిపై తిరుగుబాటు బావుటాని ఎగురవేసి వుంటే ఎలా వుండేది? అనే ఫిక్షనల్ కథని తెరకెక్కించిన తీరు ఈ ప్రాజెక్ట్ పై అంచనాల్ని పెంచేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అలియాభట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. కీలక పాత్రలో రే స్టీవెన్ సన్ , అజయ్ దేవగన్, సముద్రఖని, అలీసన్ డూడీ కనిపించబోతున్నారు.
అన్నీ సవ్యంగా వుంటే ఈ చిత్రం జనవరి 7న వరల్డ్ వైడ్ గా దాదాపు 14 భాషల్లో విడుదలయ్యేది. కానీ కోవిడ్, ఒమిక్రాన్ ల కారణంగా ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించి షాకిచ్చారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందా? అని దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ కోసం రెండు తేదీలని చిత్ర బృందం ప్రకటించింది. పరిస్థితుల చక్కబడితే, థియేటర్లకు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీకి అనుమతులిస్తే మార్చిలో లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా రాజమౌళి వెల్లడించి షాకిచ్చారు. ఓ తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్`లోని ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలపై షాకింగ్‌కామెంట్స్ చేశారు. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించారు. అయితే ఇందులో వీరికి రాజమౌళి సమాన ప్రాధాన్యతనిచ్చారా? . లేక ఒకరిపాత్రని, ప్రాముఖ్యతని తగ్గించారా? .. ఒక వేళ ఇద్దరికీ సమాన ప్రాధాన్యతనిస్తే దాన్ని ఎలా చేయగలిగారు? అని గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది.
తాజాగా ఇదే విషయాన్ని ఓ తమిళ మీడియా రాజమౌళిని ప్రశ్నించింది. దీనిపై ఆసక్తికరమైన సమాధానాన్ని చెప్పుకొచ్చారు రాజమౌళి. అంతే కాకుండా ఈ చిత్రంలోని రెండు పాత్రల్లో ఏ పాత్ర అంటే ఎక్కువ ఇష్టమో కూడా బయటపెట్టేశారు. రాజమౌళి మాట్లాడుతూ రామ్ అండ్ భీమ్ లలో ఎవరు ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. అయితే ఈ రెండు పాత్రల్లో నేను ఎక్కువగా ఇష్టపడేది మాత్రం రామ్ పాత్రనే` అని చెప్పేశారు. అంటే రామ్ చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్రని చెప్పేశారు.
ప్రస్తుతం రాజమౌళి కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన ఫ్యాన్స్ మాత్రం జక్కన్నా మరీ ఇంత ఓపెన్ గా చెప్పేస్తే ఎలా? అని కామెంట్ చేస్తున్నారు. మార్చి లేదా.. ఏప్రిల్ లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.