నందమూరి బాలకృష్ణ 'అఖండ' బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మళ్లీ ఫామ్ లోకి వచ్చేసిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొవడమే కాకుండా వసూళ్ల పరంగానూ బాలయ్య సినిమాల్లో సరికొత్త రికార్డుని సృష్టించింది.ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ లో వున్న నందమూరి బాలకృష్ణ అదే ఊపుతో 'క్రాక్' ఫేమ్ గోపీచంద్ మలినేని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తోంది. ఇటీవలే ఈ భారీ యాక్షన్ డ్రామాకు 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో నందమూరి బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మరింత పవర్ ఫుల్ గా కినిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీని 2023 సంక్రాంతికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీని సంక్రాంతి బరిలో నిలుపుతామని ప్రకటించిన చిత్ర బృందం త్వరలో రిలీజ్ డేట్ ని ప్రకటించబోతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటి హనీ రోజ్, కన్నడ నటుడు దునియా విజయ్, లాల్, రవిశంకర్, చంద్రిక రవి నటిస్తున్నారు.
ప్రస్తుతం చివరి షెడ్యూల్ ని పూర్తి చేస్తున్న చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసి త్వరలోనే ప్రమోషన్స్ ని ప్రారంభించబోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి 'రామారావు గారు' అనే మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య వయసు మళ్లిన వ్యక్తిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై యువ నిర్మాతలు హరీష్ పెద్ద, సాహు గారపాటి నిర్మించనున్నారు.
ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ఈ మూవీ బాలయ్య బిజీ షెడ్యూల్స్ కారణంగా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి బాలీవుడ్ హీరోయిన్ ని దించేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఆ వార్తల ప్రకారం అనిల్ రావిపూడి బాలయ్య కోసం దబాంగ్ బ్యూటీ సొనాక్షీసిన్హాని హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడని తెలిసింది. ముందు రకుల్ ని అనుకున్నారట. కానీ ఫైనల్ గా సొనాక్షీసిన్హాని ఫైనల్ చేసుకున్నారని తెలిసింది. శ్రీలీల,ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.