బాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది క్యాన్సర్ కారణంగా నేలరాలిపోయిన విషయం తెల్సిందే. అలాగే పలువురు సినీ స్టార్స్ క్యాన్సర్ ను జయించారు. సౌత్ మరియు బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న సోనాలి బింద్రే కూడా క్యాన్సర్ తో దాదాపు మూడు నెలల పాటు పోరాడిన విషయం తెల్సిందే. ఆమె తీవ్రమైన ఇబ్బందులను, ఆపరేషన్ లను ఎదుర్కొని చివరకు క్యాన్సర్ ను జయించింది. ప్రస్తుతం ఆమె తిరిగి మామూలు మనిషి అయ్యింది. గతంలో మాదిరిగా కాకున్నా షూటింగ్స్ కు హాజరు అవుతూ, మీడియాలో కనిపిస్తూ వస్తోంది.
తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. తనకు క్యాన్సర్ ఉందని పరీక్షల్లో వెళ్లడయినప్పుడు డాక్టర్లు నేను బతికే అవకాశం 30 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఆ సమయంలో నేను చాలా కృంగి పోయాను. కాని చనిపోతాను అని మాత్రం అనుకోలేదు. మొండిగా బతికేయాలి, బతికి అందరికి ఆదర్శంగా నిలవాలని భావించాను. అందుకోసం నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికి మర్చి పోలేను.
ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. శరీరంలో కాస్త మార్పులు మినహా తాను గతంలో మాదిరిగానే ఉత్సాహంగా ఉంటున్నట్లుగా సోనాలి చెప్పుకొచ్చింది. చావుకు దగ్గరగా వెళ్లి వచ్చినట్లుగా అనిపిస్తుందని, ఆ సందర్బంను తల్చుకుంటే హృదయం చాలా భారం అవుతుందని సోనాలి పేర్కొంది.