నీర్జా భానోట్.. ఇండియన్ ఏవియేషన్ లో తరచుగా వినిపించే పేరు ఇది. పాన్ అమెరికన్ ఎయిర్ వేస్ కు సంబంధించిన ఫ్లయిట్ అటెండెంట్ ఈమె. 1986లో కరాచీ నుంచి బయల్దేరిన ఓ ఫ్లైట్ ని.. ఆయుధాలతో కూడిన అబు నిదాల్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. ఆ ఫ్లయిట్ లోని 359మంది కాపాడి.. తన ప్రాణాన్ని పోగొట్టుకున్న 23ఏళ్ల వీరనారి కథ ఇది.
29 ఏళ్ల క్రితం జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా బాలీవుడ్ లో నీర్జా పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తోంది. అంటే.. ఈ సినిమాకి హీరో, హీరోయిన్ అన్నీ సోనమ్ కపూర్ అన్నమాట. ఈమె కెరీర్ నే మార్చేసే అవకాశం ఉన్న సినిమాగా నీర్జాని చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అప్పటి సంఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మరోవైపు ఎయిర్ హోస్టెస్ అవతారంలో సోనమ్ కపూర్ సూపర్బ్ గా ఉంది. పొడగరి కావడంతో అన్ని యాంగిల్స్ లోనూ ఫ్లైట్ అటెండెంట్ రోల్ లో ఒదిగిపోయింది.
రిలేషన్స్, సెంటిమెంట్స్ సీన్స్ లోనూ బాగా ఒదిగిపోయింది సోనమ్. ఇక ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం అని చెప్పాలి. ట్రైలర్ కి ఇచ్చి బీజీఎం అనుక్షణం ఆసక్తి కలిగించేలా రూపొందించడంలో సక్సెస్ అయ్యారు. ట్రైలర్ చూస్తుంటే చాలా ప్రామిసింగ్ గానే కాదు.. ఓ గతాన్ని కళ్లకు కడుతున్నట్లుగా అనిపించింది. సోనమ్ కపూర్ కి బెస్టాఫ్ లక్ చెప్పాల్సిందే.
Full View