సోనమ్.. మంచు దేశపు యువరాణిలా

Update: 2017-07-04 06:53 GMT
బాలీవుడ్ లో ఫ్యాషన్ స్టార్ ఎవరు అంటే మనమే కాదు బాలీవుడ్ హీరోయిన్లు కూడా చెప్పేది సోనమ్ కపూర్ పేరే. ఫ్యాషన్ దుస్తులలో సోనమ్ కనిపించే తీరును చూసి మిగతా హీరోయిన్లు కూడా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతారు. ఆమెలోని నటిని అంతగా గుర్తించని బాలీవుడ్ జనం ఆమె ఫ్యాషన్ కు మాత్రం ఫిదా అయిపోయారు. కిందటి ఏడాది విడుదలైన నీర్జా సినిమా తో సోనమ్ కపూర్ కి ఆ లోటు కూడా కొంత వరకు తీరినట్లేలాగా అనిపిస్తుంది. ఇకపోతే ఇప్పుడు ఒక ఫ్యాషన్ షో లో షో-స్టాపర్ గా వేదికపై అదరహొ అనిపించిందీ అమ్మడు.

రాల్ఫ్ అండ్ రుస్సో వింటర్ కలెక్షన్ 2017 ఫ్యాషన్ షో సోమవారం  ప్యారిస్ లో జరిగింది. మంచి విజయ గర్వంతో ఉన్న సోనమ్ ఇప్పుడు మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది ఏ ఫ్యాషన్ షో లో చూసిన. కిందటి ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ కోసం డిజైన్ చేసిన వాళ్ళే ఈ తెల్లని డైమోండ్ డ్రెస్స్ ను డిజైన్ చేసారు. ఈ షో లో సోనమ్ నడిచి వచ్చిన తీరు చూసి అక్కడ వారంతా ఎవరీ మంచు దేశపు యువరాణి మన ముందుకు వచ్చి నిలుచుంది అన్నంతగా ఆశ్చర్యపోయి చూశారులే. రాల్ఫ్ అండ్ రుస్సో డిజైన్ చేసిన ఈ పెళ్లి గౌన్ వేసుకొని షో-స్టాపర్ గా నిలిచింది సోనమ్ కపూర్. ఈ విక్టోరియా స్వరోవ్స్కి వెడ్డింగ్ గౌన్ ను మైఖేల్ సింకో డిజైన్ చేశాడు.

ఫ్యాషన్ రాంప్ వాక్లో బాగా ఆరితేరిన సోనమ్ కపూర్ కి ఈ ప్యారిస్ ఫ్యాషన్ షో కూడా నల్లేరు మీద నడిచిన అంతా సులువుగా నడిచేసింది. సినిమా విషయానికి వస్తే.. సోనమ్ కపూర్ ఇప్పుడు 'ప్యాడ్ మాన్' సినిమాలో అక్షయ్ కుమార్ కి జంటగా నటిస్తోంది. ఆ తరువాత కరీనా కపూర్ ఖాన్ నటిస్తున్న 'వీర్ ది వెడ్డింగ్' సినిమాలో  కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News