ఒకేసారి నాలుగు సినిమాల విడుదలవడం.. ఆ నాలుగూ కూడా చెప్పుకోదగ్గ సినిమాలే కావడం అరుదుగా జరిగే విషయం. ఈ వారం టాలీవుడ్ లో అదే జరిగింది. ఐతే ఇలా ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ చేసుకోవడం పెద్ద రిస్కే. ఇందులో నెగెటివ్ టాక్ వచ్చే సినిమా అడ్డంగా బుక్కయిపోతుంది. ఫలితం దారుణంగా ఉంటుంది. ‘సౌఖ్యం’ పరిస్థితి ఇలాగే ఉంది. క్రిస్మస్ సినిమాల్లోకెల్లా పెద్ద సినిమా.. జనాల్ని ఎక్కువ ఆకర్షించిన సినిమా ఇదే. ఐతే అన్నింట్లోకి బ్యాడ్ మూవీ కూడా ఇదే కాబోతోందని తొలి రోజే తేలిపోయింది.
ఈ సినిమాకు నెగెటివ్ టాక్ ఎంత వేగంగా స్ప్రెడ్ అయిందంటే.. సాయంత్రానికే థియేటర్లు వెలవెలబోయే పరిస్థితి వచ్చింది. తొలి రోజే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇక రెండో రోజు మూడు సినిమాలు థియేటర్లలోకి దిగుతున్న నేపథ్యంలో ‘సౌఖ్యం’ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
క్రిస్మస్ సినిమాల్లో ఎక్కువ థియేటర్లు దక్కించుకున్నది ‘సౌఖ్యం’ మూవీనే. ‘మామ మంచు అల్లుడు కంచు’ మోహన్ బాబు సినిమా కాబట్టి దానికీ బాగానే థియేటర్లు దొరికాయి. ఈ రెంటితో పోలిస్తే ‘భలే మంచి రోజు’కు థియేటర్లు తక్కువే. ఇక ‘జత కలిసే’ అయితే మరీ తక్కువ థియేటర్లలో రిలీజవుతోంది. ఐతే ‘భలే మంచి రోజు’కు ప్రిమియర్ షో నుంచే మంచి టాక్ మొదలైంది. ‘జత కలిసే’ విషయంలో సాయి కొర్రపాటి కాన్ఫిడెన్స్ చూస్తుంటే అది కూడా సర్ ప్రైజ్ హిట్ అయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ‘సౌఖ్యం’ థియేటర్లు ఖాళీ చేయక తప్పని పరిస్థితి తలెత్తవచ్చేమో.