మెగా కోడలు ఉపాసన కొణిదెల మాతృమూర్తిగా కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో ఎంతో సంతోషంగా షేర్ చేసుకున్నారు. మా ఇంటికి మనవడు..మనవరాలు రాబోతున్నారంటూ! తన ఆనందాన్ని అభిమానులో పంచుకున్నారు. ఇప్పటికే ఉపాసన ఏడు నెలల గర్బిణీగా అంటూ రామ్ చరణ్ ఓ సందర్భంలో మరోసారి విషయాన్ని గుర్తు చేసారు. జపాన్ అంటే తనకి ఎంతో ఇష్టమని... ఇప్పుడు జపాన్ వెళ్దామన్నా ఉపాసన లగేజ్ రెడీ చేసి పదా! అంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. జపాన్ అభిమానులతో మెగా దంపతుల బాండింగ్ గురించి ఆ రకంగా చెప్పకనే చెప్పారు.
ప్రస్తుతం ఉపాసన ఏం చేస్తున్నట్లు? అంటే అంటే ఇంటి గడప కూడా దాటడం లేదని సమాచారం. నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉండే ఉపాసన ఇప్పుడు వాటికి పూర్తిగా దూరమైనట్లు తెలుస్తుంది.
నెలలు సమీపిస్తుండటంతో కుటుంబ సభ్యులు అమెని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చరణ్ ప్రేమాభిమానాలు కూడా అంతే అవసరం కావడంతో షూట్ ముగిసిన వెంటనే చరణ్ నేరుగా ఇంటికి చేరుకుని భార్యతోనే సమయాన్ని గడుపుతున్నారుట.
ఏవైనా పనులున్నా ఈ రెండు నెలలు పాటు నో వర్క్స్ అనేస్తున్నారుట. ప్రస్తుతం ఉపాసన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్నట్లు సమాచారం. డాక్టర్ల సూచనలు..సలహాలతోనే డే ముగుస్తున్నట్లు తెలుస్తుంది.
రెగ్యులర్ గా చెకప్ లు..అవసరమైన మెడికేషన్ తీసుకుంటు న్నారుట. నెల రోజుల క్రితం వరకూ చిన్నపాటి ఎక్సర సైజులు చేసేవారుట. ఇప్పుడు వాటికి పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
అలాగే ఉపాసన బేబి బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. మరి వాటిని అధికారికంగా రిలీజ్ చేస్తారా? గోప్యంగా ఉంచుతారా? అన్నది తెలియదు. ప్రసవం తర్వాత పాపాయిని నేరుగా అభిమానులకు చూపించడం మాత్రం ఖాయం. ఆ గడియలు కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.