లైలా టీజర్.. తెల్లగ చేసుడే కాదు తోలు తీసుడు కూడా..!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో రాం నారాయణ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైలా.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో రాం నారాయణ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైలా. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. మేకప్ మేన్ గా అందరినీ తెల్లగా చేస్తున్న సోను మీద కొందరు పగబడతారు. అతని మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటారు. ఐతే సోను మాత్రం తెల్లగ్ చేసుడే కాదు తోలు తీసుడు కూడా వచ్చని తన పంజా విసురుతాడు.
చివర్లో విశక్ సేన్ లేడీ గెటప్ అదిరిపోయింది. ఓ విధంగా ఈ టీజర్ చూసి సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా ఉందని చెప్పొచ్చు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇమేజ్ కి కరెక్ట్ బొమ్మ అనిపించేలా ఈ సినిమా వచ్చింది. టీజర్ తోనే విశ్వక్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కోసం విశ్వక్ లెడీ గెటప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది.
మాస్ కా దాస్ ఫ్యాన్స్ కి సినిమా కంటెంట్ కి తగినట్టుగా కావాల్సినన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. సినిమా యూత్ ఆడియన్స్ కి ఇన్ స్టంట్ గా ఎక్కేలా ఉంది. మొన్న సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుగా వస్తే ఇప్పుడు విశ్వక్ సేన్ మేకప్ మెన్ సోనుగా వస్తున్నాడు. టీజర్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్. సినిమా టీజర్ తోనే ఇదొక పక్కా యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని హింట్ ఇచ్చారు. ఐతే విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షోగా సినిమా ఉంటుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. కెరీర్ లో ఒక సాలిడ్ సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విశ్వక్ సేన్ సోను పాత్రలో తను చేసిన హంగామాతో వస్తున్న ఈ లైలా ఎలాంటి సక్సెస్ కొడుతుంది అన్నది మాస్ కా దాస్ ఫ్యాన్స్ కి ఆసక్తికరంగా ఉంది.