డార్లింగ్ వానిటీ వ్యాన్ లో సంథింగ్ స్పెష‌ల్ ఫీచ‌ర్

Update: 2021-09-17 09:30 GMT
మ‌న టాలీవుడ్ స్టార్ హీరోల‌కు ఎవ‌రికి వారికి ఖ‌రీదైన‌ యూనిక్ వ్యానిటీ వ్యాన్ లు వున్న విష‌యం తెలిసిందే. ఒక్కో హీరో త‌మ‌కు న‌చ్చిన విధంగా వాటిని భారీ ఖ‌ర్చుతో ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ఆన్ లొకేష‌న్ అత్యంత సౌక‌ర్యంగా రిలాక్స్ కావ‌డంతో పాటు ప్ర‌త్యేకంగా వుండేలా అన్ని ర‌కాల వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసుకున్న మ‌న హీరోల వ్యానిటీ వ్యాన్ లు నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే వున్నాయి. ఆ మ‌ధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించుకున్న వ్యానిటీ వ్యాన్ వార్త‌ల్లో నిలిచి ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసిన విష‌యం తెలిసిందే.

ఆ త‌రువాత ఆ వ్యాన్ కు `పుష్ప‌` షూటింగ్ ముగించుకుని సిటీకి వ‌స్తుండ‌గా యాక్సిడెంట్ జ‌ర‌గ‌డం తెలిసిందే. ఆ త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ కు సంబంధించిన వ్యానిటీ వ్యాన్ వార్త‌ల్లో నిలిచింది. దీని కోసం మ‌హేష్ భారీగానే ఖ‌ర్చు చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపించాయి. తాజాగా `బాహుబ‌లి` ప్ర‌భాస్ కు సంబంధించిన వానిటీ వాన్ వార్త‌ల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

శుక్ర‌వారం ప్ర‌భాస్ స‌న్ రూఫ్ వానిటీ వాన్ అంటూ ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఫొటోని షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `సాహో` త‌రువాత ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న `ఆది పురుష్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ స‌న్ రూఫ్ వానిటీ వాన్ కు సంబంధించిన ఫొటోని తీసి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. అంతే కాకుండా దానికి క్యాప్ష‌న్ ని కూడా జ‌త చేశారు.

`ప‌నిలో ఉన్న‌ప్పుడు కూడా ప్ర‌కృతికి ద‌గ్గ‌రగా .. సూప‌ర్‌` అంటూ కామెంట్ చేశారు. ప్ర‌భాస్ ఇటీవ‌ల ఓ ల‌గ్జ‌రీ వ్యాన్ ని కొనుగోలు చేశారు. దీనికి స‌రికొత్త హంగుల్ని జోడించి స‌ర్వాంగ సుంద‌రంగా కావాల్సి వ‌స‌తుల‌తో పున‌ర్మించారు. ప్ర‌ధానం హైలైట్ ఏంటంటే ఈ వ్యాన్ లో స‌న్ రూఫ్ ఫీచ‌ర్ అమ‌ర్చారు. ప్ర‌భాస్
అవుట్ డోర్ లొకేష‌న్ ల‌లో షూటింగ్ చేస్తున్న‌ప్పుడు వానిటీ వ్యాన్ లో స‌హ‌జ లైటింగ్ లో రిలాక్స్ కావ‌డానికి ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఆ కార‌ణంగానే ఆయ‌న ఈ ఫీచ‌ర్ ని ప్ర‌త్యేకంగా అమ‌ర్చుకున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధేశ్యామ్‌,.. ఆది పురుష్ చిత్రాల‌తో పాటు `కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో `సలార్‌` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కూడా ముంబైలో జ‌రుగుతోంది. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్‌. ప్ర‌భాస్ వ్యానిటీ వ్యాన్ పిక్స్ చూసిన కొంత మంది అదుర్స్ అంటుంటే మ‌రి కొంత మందేమో బాహుబ‌లి అంటే ఆ స్థాయిలో వుండాల్సిందే! అంటున్నారు.


Tags:    

Similar News