కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రభుత్వాలు సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోడానికి అనుమతి ఇచ్చినా.. జనాలు సినిమాలు చూడటానికి వస్తారో లేదో అని సందేహంతో ఎవరూ ముందుకు రాలేదు. థియేటర్స్ తెరిచిన తర్వాత నిర్మాతలు ఎవరూ తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ కు ఊపిరి పోయడానికి చిన్న సినిమాలు ముందుకు వచ్చాయి. పరిస్థితులు ఎలా ఉంటాయో అనుకుంటూనే వారానికి అర డజను సినిమాలను విడుదల చేశారు. వాటిలో ''SR కళ్యాణమండపం EST.1975'' సినిమా ఒకటి.
'రాజావారు రాణిగారు' ఫేమ్ కిరణ్ అబ్బవరం - 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు ఫస్ట్ వీక్ లో థియేట్రికల్ రిలీజ్ చేశారు. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ - రాజు కలసి నిర్మించారు. సినిమా బాగుంటే ఆకుపెన్సీ - థియేటర్ల పరిస్థితి.. లాక్ డౌన్లు వంటివి తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని మరోసారి ప్రూవ్ ఈ చిత్రం నిరూపించింది.
కిరణ్ అబ్బవరం 'ఎస్ ఆర్ కళ్యాణమండపం' సినిమా రెండు వారాలు గానూ నాలుగున్నర కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ సినిమాకు విమర్శకుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రశంసలు లభించలేదు. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించడం విశేషం. ఇక థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రెండూ కలిపి ఈ సినిమాకు ఇప్పటివరకు దాదాపుగా 7 కోట్లు వరకు వచ్చినట్లు ట్రేడ్ టాక్. ఏదేమైనా ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన చిత్రాల్లో సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ అనిపించుకుంది.
'SR కళ్యాణమండంపం' చిత్రానికి హీరో కిరణ్ అబ్బవరం కథ - స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు. ఇందులో సాయి కుమార్ - తనికెళ్ల భరణి - తులసి - శ్రీకాంత్ అయ్యంగార్ - టీఎన్నార్ - అరుణ్ - అనిల్ - భరత్ - కిట్టయ్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందించారు.