చాలా కాలం క్రితం అనూహ్యమైన విజయాలను సాధించిన ప్రేమకథా చిత్రాల జాబితాను పరిశీలిస్తే, ఆ జాబితాలో 'రోజాపూలు' సినిమా కనిపిస్తుంది. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. అలాంటి ఈ సినిమాతో వెండితెరకి పరిచయమైన హీరోగా శ్రీరామ్ కనిపిస్తాడు. తెలుగులో 'ఒకరికి ఒకరు' .. 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' వంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను ఆయన పంచుకున్నాడు.
"మా ఫాదర్ వాళ్లది చిత్తూరు .. అమ్మా వాళ్లది కుంభకోణం. నేను పెళ్లి చేసుకున్నది తెలుగు అమ్మాయినే. మాకు ఇద్దరు పిల్లలు అహిల్ .. అహన. కాలేజ్ రోజుల్లో నేను మోడలింగ్ చేసేవాడిని. ఒకసారి నేను మోడలింగ్ చేస్తుండగా దర్శకుడు కదీర్ నన్ను చూసి నేను హీరోగా .. భూమిక హీరోయిన్ గా ఒక సినిమా ప్లాన్ చేశాడు. కొన్ని కారణాల వలన నేను .. భూమిక ఆ సినిమా చేయలేకపోయాము.
ఆ తరువాత రెండేళ్లకు శశి దర్శకత్వంలో మేమిద్దరం 'రోజాపూలు' సినిమా చేశాము. అప్పటికే భూమిక పవన్ కల్యాణ్ గారితో 'ఖుషీ' చేసి స్టార్ హీరోయిన్ గా ఉన్నారు.
ఆ సినిమా చూసిన దగ్గర నుంచి నేను భూమిక అభిమానినయ్యాను. అలాంటిది ఆమెతో కలిసి నటించే అవకాశం రావడం .. ఫస్టు డే మా ఇద్దరి మధ్య లవ్ సీన్ తీయడం నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. తమిళంలో నేను త్రిష కలిసి 'మనసెల్లామ్' అనే సినిమాను చేశాము.
ఆ సినిమా చేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక షాట్ లో తెలియక రబ్బర్ సొల్యూషన్ ఎక్కువగా పోయడం వలన ఆ ప్రమాదం జరిగింది. తప్పించుకోవడానికి సమయం లేదు .. మార్గం లేదు. మంటలు పది అడుగుల పైకి లేవడంతో అందరూ భయపడిపోయారు. మొత్తానికి ఎలాగో బయటపడ్డాను.
నేను మంటల్లో నుంచి బయటికి వచ్చిన తరువాత షర్ట్ విప్పిస్తే దానితో పాటు చర్మం కూడా ఊడి వచ్చింది.లిప్స్ .. హెయిర్ .. చెవులు .. చెంపలు .. చేతులు .. కాళ్లు కాలిపోయాయి. హాస్పిటల్లో బెడ్ పై ఇలా ఉన్నాను .. ఇక నేను బ్రతకననుకున్నాను. 6 నెలల పాటు హాస్పిటల్లో ఉండాలని చెప్పారు. పూర్తిగా కోలుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుందని అన్నారు. అప్పటికి ఒప్పుకున్న సినిమాలన్నీ పోతున్నాయి. అప్పటికి మా ఫాదర్ జాబ్ మానేశారు .. బ్యాంకు బ్యాలెన్స్ ఏమీ లేదు .. ఎలా? అనే ఒక ఆలోచనే బుర్రలో తిరుగుతుండేది.
ఆ సమయంలో రసూల్ గారు నాతో 'ఒకరికి ఒకరు' సినిమాను ప్లాన్ చేశారు. "ఏమీ కాదు .. వచ్చేయ్ షూటింగు చేసుకుందాం. నువ్వు నా సినిమాకి హీరోవి. అవసరమైతే ఆపేస్తాను తప్ప వేరేవారితో ఆ సినిమాను చేయను" అంటూ నాలో ధైర్యం నూరిపోశారు. అలా ఆయన ఇచ్చిన ఉత్సాహంతో ఆ సినిమాను చేశాను. తెలుగులో నా మొదటి సినిమా అదే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది" అని చెప్పుకొచ్