వివాదాలకు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సినీ నటి శ్రీరెడ్డి తాజాగా పోస్టు చేసిన ఒక వీడియో పెను దుమారంగా మారే వీలుందని చెబుతున్నారు. గంటలో చెన్నై కు బయలుదేరుతానని.. అక్కడే మూడు రోజులు ఉంటానని చెప్పిన శ్రీరెడ్డి.. చెన్నై పోలీసుల్ని కలిసి తాను కొందరు నటులపైనా.. చిత్ర పరిశ్రమకు చెందిన వారిపైనా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
తనకు అవకాశాలు ఇస్తానని తనను వాడుకున్న వారిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.అదే సమయంలో టాలీవుడ్ తో పోలిస్తే కోలీవుడ్ మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. కోలీవుడ్ లో మహిళలకు గౌరవం ఇస్తారన్నారు. విశాల్ మీద తనకు నమ్మకం లేదన్న ఆమె.. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వారి మీద తనకు నమ్మకం లేదన్నారు.
విశాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నడిగర్ సంఘం మీద విమర్శలు చేసిన ఆమె.. విశాల్ తన గురించి మాట్లాడటంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తాను చేస్తున్నదంతా పబ్లిసిటీ కోసమేనని విశాల్ వ్యాఖ్యానించటం సరికాదన్నామె.. చూస్తూ.. చూస్తూ పబ్లిసిటీ కోసం క్యారెక్టర్ మీద మచ్చలు వేసుకుంటారా? ఎవరైనా? మీలాంటి వాళ్లు కూడా ఇలా ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. తనను ఇంటర్నేషనల్ మీడియా సైతం కవర్ చేసిందని.. అలాంటప్పుడు తనకు పబ్లిసిటీ అవసరం ఏమిటని ప్రశ్నించారు.
తాను మూడు రోజులు చెన్నైలో ఉంటానని.. తనకు తగిన రక్షణ కల్పించాలంటూ విశాల్ ను కోరారు. చికాగో పోలీసులు టాలీవుడ్ యాక్టర్ల సెక్స్ రాకెట్ ను బయటపెట్టారని.. వారు చేసిందంతా కూడా పబ్లిసిటీ కోసమేనా? అని ప్రశ్నించిన ఆమె.. టాలీవుడ్.. కోలీవుడ్ కు చెందిన కొందరు హీరోయిన్లు అమెరికా.. దుబాయ్ వెళ్లి వ్యభిచారం చేస్తున్నారంటూ ఆరోపించారు.
కొంత ఇంగ్లిషులో మాట్లాడిన శ్రీరెడ్డి.. అనంతరం తెలుగులోకి షిఫ్ట్ అయి.. ప్రముఖ నిర్మాతలు అల్లుఅరవింద్.. దగ్గుబాటి సురేశ్ బాబులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవకాశాల కోసం వస్తున్న ఆడవాళ్లను.. వారి పిల్లలు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారంటూ నిందించారు. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి? ఇండస్ట్రీ గొప్పతనం గురించి అల్లు అరవింద్ చాలా చెబుతారని.. కానీ.. మీ కన్న కొడుకుల్ని మాత్రం రోడ్డు మీదకు వదిలేసి.. ఆడవాళ్ల పట్ల వాళ్లు వ్యవహరించే తీరును తప్పుపట్టారు.
ప్రొడ్యూసర్ కొడుకులు అయితే ఏంటి సార్? పెద్ద మనుషులు బాధ్యతగా ఉండాలంటూ.. వాళ్లువ్యవహరించే తీరు ఎలా ఉందో చూస్తున్నారా? అని ప్రశ్నించారు. అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడితే రాలేని వారు.. పవన్ ను ఒక్క మాట అన్నంతనే బయటకు వచ్చారని.. ఇండస్ట్రీ సమస్యల మీద గళం విప్పితే ఎందుకు రారంటూ నిలదీసే ప్రయత్నం చేశారు.
అల్లుఅరవింద్.. సురేశ్ బాబు కొడుకుల కారణంగా ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? అంటూ క్వశ్చన్ వేసిన ఆమె.. మీరంతా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారని.. థియేటర్లు మీ చేతుల్లోనే ఉన్నాయి.. సినిమాలు మీరే చేస్తారు? చిన్న సినిమాలు విడుదల కాకుండా అడ్డుకుంటారు.. అవసరమైతే తొక్కేస్తారు.. కావాలనుకుంటే వాటిని ఎప్పుడు విడుదల చేయాలో మీరే డిసైడ్ చేస్తారంటూ పలుఅంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మగాడు అమ్మాయిలతో పడుకుంటే శృంగార పురుషుడని కీర్తిస్తారని.. వాడికేం రా.. అమ్మాయిలు వాలిపోతారని గొప్పగా చెప్పుకుంటారని.. కానీ.. అదే అమ్మాయి కడుపు కాలి అవకాశాల కోసం పడుకుంటే మాత్రం హెచ్ ఐవీ రాలేదా? అని అడుగుతున్నారంటూ మండిపడ్డారు.
తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. ఒక్క డిసీజ్ కూడా తనకు రాలేదని చెప్పిన ఆమె.. అవకాశాల కోసం రాజీ పడిన తమను పురుగుల్లా చూస్తున్నారని.. బడా నిర్మాతల కొడుకుల కారణంగా ఇండస్ట్రీకి రావాలనుకునే ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ చూడాలన్నారు. ఈ రోజు తనను నటిగా కాదు.. వ్యభిచారిణిగా ముద్ర వేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తాను చేస్తున్న పోరాటమంతా తనకు అవకాశాలు ఇవ్వాలనో.. తనకు పబ్లిసిటీ రావాలనో కాదని.. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు ఒక ప్రొటెక్షన్ లేయర్ నుఏర్పాటు చేయాల్సి ఉందని.. అది చేస్తే తన పోరాటానికి అర్థం ఉంటుందని చెప్పారు. ఊహించని రీతిలో బడా నిర్మాతల మీద శ్రీరెడ్డి చేసిన బోల్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారంగా మారాయని చెప్పక తప్పదు.
Full View