శ్రీదేవి ని ముర‌ళి మోహ‌న్ కి ఇచ్చి పెళ్లి చేయాల‌న్న‌ది మామ్ ప్లాన్!

Update: 2023-06-24 06:00 GMT
అతిలోక సుంద‌రి శ్రీదేవిని ఆరాధించ‌న‌ది ఎవ‌రు?  కోట్లాది మంది హృద‌యాల్లో నిలిచిన గొప్ప తార‌.  లెజెండ‌రి న‌టిగా భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసిన గొప్ప న‌టి. ఇక అమె అందానికి మంత్ర ముగ్దులు కానిది ఎవ‌రు. సాధార‌ణ ప్రేక్ష‌కుడి నుంచి ప్ర‌తీ ఒక్క‌రు ఆమెను ఎంత‌గానో అరాదించారు. చివ‌రిగా బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ని వివాహం చేసుకుని ముంబైలో స్థిర‌ప‌డింది. అటుపైనా సంచ‌ల‌నాల రాంగోల్ వ‌ర్మ శ్రీదేవి బ్యూటీపై ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ కామెంట్లు చేస్తూనే ఉండేవారు.

ఇది స‌ప‌రేట్ ట్రాక్ అనుకోండి. అయితే శ్రీదేవి..బోనీక‌పూర్ కి మ‌న‌సిచ్చింది కాబ‌ట్టి ఆయ‌న్ని పెళ్లి చేసుకుంది. కానీ శ్రీదేవి త‌ల్లి మాత్రం ఇంటికి అల్లుడిగా మ‌రో వ్య‌క్తి వ‌స్తే బాగుందేని ఆమె  మ‌న‌సులో భావ‌న‌గా తెలుస్తోంది.

తాజాగా  ఓ ఇంట‌ర్వ్యూలో సీనియర్ న‌టుడు ముర‌ళి మోహ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేసారు. శ్రీదేవిని ..ముర‌ళీ మోహ‌న్ కి ఇచ్చి చేస్తే బాగుంటుంద‌ని శ్రీదేవి అమ్మ అనుకునేవారుట‌. ముర‌ళి  మోహ‌న్ గుణ‌గ‌ణాలు..నెమ్మ‌దిత‌నం న‌చ్చి అల్లుడు తాను అయితే బాగుండ‌ని అనుకునేవారుట‌.

ఆ విష‌యం ముర‌ళి మోహ‌న్ కి ఓ సంద‌ర్భంలో తెలిసిందిట‌. అయితే త‌ర్వాత దానిపై ఎలాంటి అప్ డేట్ త‌న‌కి లేద‌ని...అదే మొద‌టి సారి ..అదే చివ‌రి సారి అని తెలిపారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కూడా ముర‌ళీ మోహ‌న్ ని శ్రీరామ చంద్రుడు అని పిలిచేవారుట‌.  

ఆయ‌న అలా అన్నందుకు అన్న? ఆ పేరు నిల‌బెట్టుకోవాల‌ని బుద్దిమంతుడిగా ఉండేవాడు న్నారు. పొదుపు గా..పొందుక్కుగా ఉండ‌టం ఆయ‌న్ని చూసి నేర్చుక‌న్న‌ట్లు తెలిపారు.

త‌న‌లో ఆ మంచిత‌నం శ్రీదేవి అమ్మ‌గారు ఏఎన్నార్ గారు ద్వారా  తెలుసుకోవ‌డం...త‌ర్వాత త‌న‌ని చూడ‌టం జ‌రిగంద‌న్నారు. అదే శ్రీదేవి అమ్మ‌గారు అనుకున్న‌ది జ‌రిగి ఉంటే?  నేడు స‌న్నివేశం మ‌రోలా ఉండేదేమో. అదీ మ్యాట‌ర్. ప్ర‌స్తుతం ముర‌ళి మోహ‌న్ పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు. రాజ‌కీయాల్లోనూ యాక్టివ్ గా లేరు. వ్యాపారాలు అంత‌గా బిజీ  కావ‌డం లేదు. వ్యాపార బాధ్య‌త‌లు పిల్ల‌ల‌కు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తుంది.     

Similar News