కొత్త బంగారు లోకం.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మహేష్ బాబు సినీ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ చిత్రాల్లో బ్రహ్మోత్సవం నిలిచింది. దాంతో శ్రీకాంత్ అడ్డాలను చాలా మంది పక్కన పెట్టారు అనే టాక్ వచ్చింది.
చాలా కాలం తర్వాత వెంకటేష్ హీరోగా 'నారప్ప' సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు. నారప్ప థియేట్రికల్ రిలీజ్ మిస్ అయ్యి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా కూడా మంచి ఆధరణ దక్కించుకుని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ నుండి కాస్త బయట పడ్డాడు అని చెప్పుకోవచ్చు.
నారప్ప తర్వాత మరో సినిమాకు శ్రీకాంత్ అడ్డాల రెడీ అవుతున్నాడు. జయ జానకీ నాయక తో పాటు పలు చిన్న పెద్ద సినిమాలను నిర్మించిన మిరియాల రవీందర్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన కుర్రాడు హీరోగా 'పెద్ద కాపు' అనే సినిమా ను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కథ రీత్యా రెండు పార్ట్ లుగా విడుదల చేయాలని నిర్ణయించారు.
బాహుబలి సినిమా ను రెండు పార్ట్ లుగా విడుదల చేసిన జక్కన్న ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. కేజీఎఫ్ రెండు పార్ట్ లుగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప రెండవ పార్ట్ రూపొందుతోంది. ఇంకా కొన్ని సినిమాలు కూడా రెండవ పార్ట్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పెద కాపు సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయాలని శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
1980 బ్యాక్ డ్రాప్ లో రాజకీయాలు మరియు కులాల గొడవల కాన్సెప్ట్ తో పీరియాడిక్ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమా తో శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవ్వడం ఖాయం అనే నమ్మకాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.