శ్రీమంతుడు సాధించేశాడోచ్

Update: 2015-08-24 10:27 GMT
బాహుబలి రికార్డుల గురించి ఎవ్వరూ ఆలోచించే పరిస్థితి లేదు. ఆ సినిమాను వేరే కేటగిరిలోకి నెట్టేసి.. మిగతా రికార్డుల మీద ఎవ్వరైనా కన్నెయ్యాలి. మహేష్ కూడా అదే చేశాడు. అత్తారింటికి దారేది రికార్డుల్ని టార్గెట్ చేసుకుని బరిలోకి దిగాడు. కంటెంట్ బలంగా ఉండటంతో అతడి టార్గెట్ మిస్సవలేదు. ‘అత్తారింటికి దారేది’ రికార్డులు చెరిగిపోయాయి. నాన్-బాహుబలి రికార్డుల్లో ఇప్పుడు ‘శ్రీమంతుడు’దే అగ్రస్థానం. ఇప్పటిదాకా మొత్తం రూ.76 కోట్ల షేర్ తో ‘అత్తారింటికి దారేది’ సినిమాను దాటేసింది ‘శ్రీమంతుడు’. శ్రీమంతుడు గ్రాస్ వసూళ్లు రూ.120 కోట్ల దాకా ఉన్నాయి.

ఐతే డబ్బింగ్ వెర్షన్ల వసూళ్లు కూడా కలుపుకుంటే శ్రీమంతుడు వెనక్కి వెళ్లిపోతాడు. మగధీర సినిమా తమిళం, మలయాళం, హిందీ వెర్షన్లలో కూడా మంచి వసూళ్లు సాధించింది. ఆ లెక్కలన్నీ కలిపితే మగధీర.. శ్రీమంతుడు కన్నా ముందుంటుంది. రూ.83 కోట్లతో బాహుబలి తర్వాతి స్థానం ‘మగధీర’దే. ఐతే శ్రీమంతుడు ఫుల్ రన్ లో ఈ రికార్డును కూడా దాటేయడం ఖాయమే. ఇప్పటికీ ‘శ్రీమంతుడు’ వసూళ్లు పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి. గత శుక్రవారం వచ్చిన ‘కిక్-2’కు డివైడ్ టాక్ రావడంతో ‘శ్రీమంతుడు’కి కలిసొచ్చింది. ఇంకో వారం బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు వసూళ్లు రాబట్టినా చాలా ‘మగధీర’ను దాటేయొచ్చు. ఐతే వంద కోట్ల షేర్ రికార్డును అందుకోవడం మాత్రం సాధ్యమయ్యేలా లేదు.
Tags:    

Similar News