ఆ దర్శకుడు పవన్ తో ఏడాది పాటు..

Update: 2017-02-21 09:33 GMT
‘పెళ్లిచూపులు’ సినిమాతో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. అతను కథానాయకుడిగా నటించిన తర్వాతి సినిమా ‘ద్వారక’కు కూడా కొంత పాజిటివ్ బజ్ వచ్చింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమైంది. ఎట్టకేలకు మార్చి 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంతో శ్రీనివాస్ రవీంద్ర అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. అతను పవన్ కళ్యాణ్ దగ్గర కూడా పని చేశాడట. పవన్ తో కలిసి ఏడాది ప్రయాణం చేశానని.. ఆ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నానని అంటున్నాడు శ్రీనివాస్ రవీంద్ర. తన నేపథ్యం.. ‘ద్వారక’ సినిమా గురించి అతనేమంటున్నాడంటే..

‘‘నేను బేసిగ్గా పెయింటర్. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. తమ్మారెడ్డి భరద్వాజ.. వీరశంకర్‌.. భీమనేని శ్రీనివాసరావుల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశా. పవన్‌ కళ్యాణ్‌ గారితోనూ ఓ ఏడాది ప్రయాణం చేశా. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకుున్నా. దిల్‌ రాజు గారి ‘కొత్తబంగారులోకం’.. దశరథ్ ‘గ్రీకువీరుడు’ సినిమాలకు స్క్రీన్‌ ప్లే సహకారం అందించాను. ద్వారక సినిమా కథను నిర్మాత ప్రద్యుమ్నకు చెప్పడం ఆలస్యం.. అడ్వాన్స్ చేతిలో పెట్టేశారు. ఆర్.బి.చౌదరి లాంటి పెద్ద నిర్మాత అండగా నిలిచారు. ‘‘ద్వారక అనే అపార్ట్‌మెంట్‌లో శ్రీకృష్ణుడి తరహా లక్షణాలున్న ఎర్ర శీను అనే కుర్రాడి కథ ఇది. అతనో దొంగ. శ్రీకృష్ణుడు దొంగ.. పైగా రొమాంటిక్ కాబట్టి తాను కూడా అదే బాటలో నడుస్తుంటాడు. బాబా అవతారం కూడా ఎత్తుతాడు. అలాంటి టైంలో హీరోయిన్ పాత్ర అతడిలో మార్పు తీసుకొస్తుంది. దీంతో అతను ఎలా పరిణతి చెందాడన్నది ఈ కథ. ఇదొక సెటైరికల్ కామెడీ మూవీ. అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకుంటుంది అని శ్రీనివాస్ రవీంద్ర తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News