ట్రైలర్ టాక్‌: శ్రీరస్తు అదరిందిగా..

Update: 2016-07-26 06:58 GMT
శ్రీరస్తు.. శుభమస్తు.. మెగా ఫ్యామిలీ హీరో నుంచి రాబోతున్న మరుసటి మూవీ. సోలో ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిపోయింది. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యాక అప్పుడు ఒక్కో అప్ డేట్ చొప్పున ఇస్తూ క్రేజ్ తీసుకొచ్చారు. అలాగే ఒక్కోపాటను విడుదల చేస్తూ.. హైప్ పెంచేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పుడీ శ్రీరస్తు..శుభమస్తుకి థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ అయింది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ట్రైలర్ లో ప్రతీ ఫ్రేమ్ ఇరగదీసేశారంతే. అటు కామెడీ నుంచి ఇటు పంచ్ డైలాగ్స్ వరకూ.. ఎమోషన్స్ నుంచి  సెంటిమెంట్స్ వరకూ సూపర్బ్ గా కుదిరాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠి అయితే.. ఎంత అందంగా కనిపించిందో.. అంతే అల్లరి చేసేసింది. హీరోని ఓ సారి అన్నయ్య అని.. ఓ సారి తమ్ముడు అని ఆడేసుకుందంతే. ఇక హీరో అల్లు శిరీష్ గురించి అయితే  చాలానే చెప్పుకోవాలి. మొదటి రెండు సినిమాలతో పోల్చితే.. చాలా మెచ్యూర్ అయ్యాడు.

కామెడీ విషయంలో అల్లు శిరీష్ టైమింగ్ ని సూపర్ గా వాడుకున్నాడు దర్శకుడు. ఇందుకు చివర్లో వచ్చే డైలాగ్ 'మేడమ్ - నేనే బ్లాక్ మెయిల్ చేసేట్లయితే.. మీ దగ్గర్నుంచి చాలా అడగ్గలను' అంటూనే అమ్మాయి బాడీని పైనుంచి కిందవరకూ చూసే సీన్ బాగా పేలింది. రావు రమేష్ డైలాగ్ కూడా ట్రైలర్ లో కీలకం. మొత్తానికి భారీ కాస్టింగ్ తో వస్తున్న శ్రీరస్తు శుభమస్తు.. ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Full View

Tags:    

Similar News