సూర్యని సౌత్ సూపర్‌స్టార్‌ని చేసిన సినిమా 'గజిని'. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య నటన అసమానం. తమిళ్, తెలుగు రెండు చోట్లా బ్లాక్‌బస్టర్ హిట్. హిందీలోనూ రీమేకై సంచలన విజయం సాధించింది. అందుకే ఇప్పటికీ తెలుగులో సూర్య సూపర్‌స్టార్. ఆ తరువాత యముడు ఒక్కటే ఆ రేంజ్ హిట్టయ్యంది.
ఇక ఇటీవలి కాలంలో సూర్య నటించిన సినిమాలేవీ రిలీజ్‌కి రాలేదు. ప్రస్తుతం సూర్య ఓ ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. టైటిల్ మాస్. విక్రమ్ ప్రభు దర్శకుడు. ఇందులో సూర్య రూపం చాలా విలక్షణంగా ఉంది. ఒళ్లంతా నల్లగా, ఇంజిన్ ఆయిల్ పూసుకున్నట్టు సరికొత్త రూపంతో కనిపిస్తున్నాడు. ఈ పాత్రలో సంథింగ్ ఏదో ఉందనిపిస్తోంది. గజిని, యముడు తర్వాత మళ్లీ ఆ రేంజులో ఈ సినిమా ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇప్పటికే యువన్ శంకర్ రాజా బాణీలు అందించాడు. ఇందులో ఒకానొక మాస్‌బీట్‌కి తమన్‌ని ఎంపిక చేసుకున్నారు. తక్కువ సమయంలో బాణీ కట్టేసే సంగీతదర్శకుడిగా తమన్‌కి పేరుంది. మాస్‌బీట్‌ని ఇవ్వడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నాడు. అందుకే ఇలా అవకాశం ఇచ్చారన్నమాట!!