ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్

Update: 2023-02-22 05:00 GMT
సెలబ్రిటీలకి చెందిన చిన్నప్పటి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా క్యూట్ గా ఉండే లుక్స్ తో కట్టిపడేసే సెలబ్రిటీల చైల్డ్ హుడ్ మెమోరీస్ ని ఈ ఫోటోలు గుర్తు చేస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఒక సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోలో తల నిండా మల్లెపూలు పెట్టుకొని చాలా క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో కట్టిపడేస్తున్న చిన్నారి ప్రస్తుతం పెద్ద స్టార్ హీరోయిన్.

 సౌత్ లో స్టార్ హీరోలు అందరితో ఆదిపాడిన ఆ అందాల భామ ఇప్పుడు నార్త్ లో కూడా పాగా వేయడానికి రెడీ అవుతుంది. ఇక ఆ చిన్నారిగా ఉన్న అమ్మడు స్టార్ హీరోయిన్ సమంత అంటే ఎవరూ నమ్మలేరు. సమంత చిన్న వయస్సు నుంచి కాలేజీ డేస్ వరకు చాలా సింపుల్ గా ఉండేది.

మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ కారణంగా ఆమె ఎక్కువగా చదువుల మీదనే శ్రద్ధ పెట్టేది. అయితే అనుకోకుండా తమిళ్ లో ఓ కమర్షియల్ యాడ్ లో ఆరంభంలో కనిపించింది. తరువాత రాహుల్ రవీంద్రన్ తో ఒక సినిమా చేసింది.

 అదే సమంత మొదటి సినిమా తర్వాత గౌతమ్ మీనన్ దృష్టిలో పడటంతో తెలుగులో ఏ మాయచేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ వైడ్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయింది.

 సోలోగా ఫిమేల్ సెంట్రిక్ కథలకి సామ్ కేరాఫ్ గా ప్రస్తుతం మారిపోయింది. ఆమె నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఖుషి మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ కి రంగం సిద్ధం అవుతుంది.

దీనికోసం జిమ్ లో గంటల తరబడి కష్టపడుతూ పెర్ఫెక్ట్ బాడీని తయారు చేసుకుంటుంది. ఫిట్ నెస్ కి కేరాఫ్ గా ఇప్పుడు సమంత మారిపోయింది. మయోసైటిస్ తో పోరాడి గెలిచి అమ్మాయిలకి స్పూర్తిగా నిలుస్తుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News