అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ చక చక జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కనుక మరో రెండు నెల్లోనే ఈ సినిమాను ముగించేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. అక్కడ షెడ్యూల్ ను ముగించుకుని అప్పుడే యూనిట్ సభ్యులు తమిళనాడుకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పుష్ప సినిమా షూటింగ్ కోసం తమిళనాడు వెళ్తున్నట్లుగా ట్వీట్ చేశాడు.
కీలక యాక్షన్ చేజింగ్ సన్నివేశాలను మొన్నటి వరకు పూర్తి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు పాట చిత్రీకరణకు సిద్దం అయ్యారు. సుకుమార్ సినిమాలో పాటలన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటికప్పుడు సుకుమార్ సినిమాలకు కొత్త మాస్ బీట్స్ ను ఇస్తూనే వస్తున్నాడు. ఇక పుష్ప కోసం మరింత శ్రద్ద తీసుకుని ట్యూన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఇదో మ్యూజికల్ ఆల్బం గా నిలుస్తుందనే నమ్మకంను బన్నీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని టెన్ కాశిలో పాటను చిత్రీకరించబోతున్నట్లుగా జానీ మాస్టర్ ట్వీట్ ద్వారా తెలుస్తోంది.