ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు వుండరంటారు. ఇది చాలా సందర్భాల్లో నిజమని నిరూపితమైంది కూడా. కానీ ఓ స్టార్ డైరెక్టర్ - స్టార్ పప్రొడక్షన్ కంపనీ మధ్య ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ప్రచ్ఛన్న యుద్ధం ముదురుతోందే కానీ తగ్గడం లేదు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం ముగియడం లేదు.సమయం దొరికితే సదరు స్టార్ ప్రొడక్షన్ హౌస్ ని ఓ ఆట ఆడుకోవాలని స్టార్ డైరెక్టర్ చూస్తుంటే అతన్ని ఎలా ఇరుకున పెట్టాలా? అని స్టార్ ప్రొడక్షన్ వర్గాలు చూస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఇండస్ట్రీలో వున్న స్టార్ డైరెక్టర్ లలో ఒకరాయన. అంతే కాకుండా ఓ ఓ క్రేజీ స్టార్ హీరోకు అత్యంత సన్నిహితులు కూడా. అలాంటి స్టార్ డైరెక్టర్ తో కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకున్న సంస్థ అడ్వాన్స్ ఇచ్చిందట. అయితే ఎంతకీ సదరు స్టార్ డైరెక్టర్ తను చేసుకున్న అగ్రిమెంట్ కి కట్టుబడి వుండలేదట. సదరు సంస్థకు సినిమా చేయడానికి టైమ్ ఇవ్వలేదట. ఎంత ప్రయత్నించినా తప్పించుకు తిరుగుతూ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా వుండటం మొదలుపెట్టారట.
దీంతో సదరు సంస్థ చేసేది లేక అడ్వాన్స్ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా సదరు డైరెక్టర్ తమకు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సినిమా చేయకపోవడంతో తాము ఇచ్చిన అడ్వాన్స్ ని వడ్డీతో సహ కలిపి తిరిగి ఇవ్వమని ఖచ్చితంగా నిలదీసిందట. దీంతో చేసేది లేక సదరు సంస్థ తనకు అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తానికి వడ్డీ కలిపి స్టార్ డైరెక్టర్ తిరిగి చెల్లించేశాడట. అప్పటి నుంచి స్టార్ డైరెక్టర్, స్టార్ ప్రొడక్షన్ కంపనీ మధ్య ప్రచ్ఛన్న యుద్దం జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సదరు స్టార్ డైరెక్టర్ అవకాశం చిక్కడంతో సదరు స్టార్ ప్రొడక్షన్ కంపనీకి చుక్కలు చూపిస్తున్నాడట. స్టార్ డైరెక్టర్ కు అత్యంత సన్నిహితుడైన స్టార్ హీరోతో సదరు ప్రొడక్షన్ కంపనీ ఓ భారీ చిత్రాన్ని ప్రకటించింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ స్టార్ డైరెక్టర్ సడన్ ట్విస్ట్.. తన హీరోకి రీమేక్ సినిమా చేయమని సలహా ఇవ్వడం, దానికి తానే డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం చేశారు. ఇది పూర్తయి రిలీజ్ అయింది.. ఇక స్టార్ ప్రొడక్షన్ కంపనీ తమ సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్న తరుణంలో మరో తమిళ రీమేక్ చిత్రాన్ని చేయమని సదరు స్టార్ హీరోకు సూచించారు.
దీంతో మళ్లీ స్టార్ ప్రొడక్షన్ కంపనీకి బిగ్ షాక్ తగిలింది. ఈసాకరి ఎలాగైనా స్టార్ హీరోతో పోస్ట్ పోన్ అవుతున్న ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ప్రయత్నాలకు ఎలాగైనా గండి కొట్టాలనుకుంటున్న స్టార్ డైరెక్టర్ సదరు స్టార్ హీరోతో రెండు భారీ ప్రాజెక్ట్ లని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆ హీరోకు తన ప్రాజెక్ట్ ల గురించి స్టార్ డైరెక్టర్ చెప్పేశారని, త్వరలోనే వీటి అనౌన్స్ మెంట్ రాబోతోందిని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదే గనక జరిగి సదరు స్టార్ హీరో తనకు అత్యంత సన్నిహితుడైన స్టార్ డైరెక్టర్ సినిమాకు ముందు ప్రాధాన్యతనిస్తే స్టార్ ప్రొడక్షన్ కంపనీ మరో సారి ఇబ్బందులు ఎదుర్కోవడం గ్యారెంటీ అంటున్నారు.
ఈ ఇద్దరి కోల్డ్ వార్ కారణంగా పవన్ కు గతంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ సఫర్ అవుతున్నారట. ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించలేక.. మరో హీరో దగ్గరికి వెళ్లలేక సతమతమవుతున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు డైరెక్టర్ , హీరో, టెక్నీషియన్ లకు అడ్వాన్స్ ల రూపంలో భారీ మొత్తానికి లాక్ అయిపోయిన స్టార్ ప్రొడక్షన్ కంపనీ ఎలాగైనా ఈ మూవీని పట్టాలెక్కించాలనే పట్టుదలతో వుందట. కానీ సదరు స్టార్ డైరెక్టర్ వుండగా స్టార్ హీరో ఆ సినిమాకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదని, ఈ ప్రాజెక్ట్ ఇక ఆగిపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. స్టార్ డైరెక్టర్ పంతం .. స్టార్ ప్రొడక్షన్ కంపనీని ముప్పుతిప్పలు పెడుతుండటం గమనార్హం.