ఆ ఛాన్స్ వ‌దులుకున్నందుకు ఇప్ప‌టీకీ బాధే

Update: 2021-07-07 02:30 GMT
ఆ ఛాన్స్ వ‌దులుకున్నందుకు ఇప్ప‌టీకీ బాధే
  • whatsapp icon
బాలీవుడ్ లో సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `స‌ర్కార్` అప్ప‌ట్లో ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్- అభిషేక్ బ‌చ్చ‌న్- కృష్ణ‌కుమార్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. బాక్సాఫీస్ వద్ద కోట్లు వ‌సూలు చేసింది. పొలిటిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో సినిమా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. వ‌ర్మ త‌న‌దైన‌ శైలి మేకింగ్ తో యాక్ష‌న్ స‌న్నివేశాలతో ర‌క్తి క‌ట్టించారు.

ఆర్జీవీ సృష్టించిన ప్ర‌తి పాత్రా  హైలైట్. ముఖ్యంగా ఇందులో వీరేంద్ర స్వామి అనే పాత్ర‌ను తెలుగు న‌టుడు జీవా పోషించారు. ఆ పాత్ర‌లో జీవ నిజంగా జీవం పోసార‌నే చెప్పాలి. స్వామి పాత్ర‌లో ఆహార్యం న‌ట‌న అన్నీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

గుబురు గెబ్బం... మీసాల‌తో క‌నిపించే ఆ పాత్ర ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. అయితే ఈ పాత్రలో తొలుత టాలీవుడ్ వెట‌ర‌న్ న‌టుడు  త‌నికెళ్ల భ‌రిణికి అవ‌కాశం ద‌క్కింద‌న్న విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఓ ఇంట‌ర్వ్యూలో త‌నికెళ్ల భ‌ర‌ణి స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే ఆ ఛాన్స్ వ‌దులుకున్నందుకు త‌ర్వాత చాలా బాధ ప‌డ్డాన‌ని...ఇప్ప‌టికీ బాధ‌పడుతున్నాన‌ని తెలిపారు. జీవా న‌టించిన పాత్ర‌లో న‌టించ‌మ‌ని ముందుగా రామ్ గోపాల్ వ‌ర్మ కోరారుట‌. అందుకుగాను బాగా గెడ్డం.. మీసాలు పెంచాల‌ని కోరారుట‌. కానీ అందుకు త‌నికెళ్ల భ‌ర‌ణి ఇంట్రెస్ట్ చూపించ‌క సున్నిశితంగా అవ‌కాశం తిర‌స్క‌రించాన‌ని తెలిపారు.

ఆ త‌ర్వాత  వ‌ర్మ అసిస్టెంట్ మ‌రొక‌రు భ‌ర‌ణి ఒప్పించే ప్ర‌య‌త్నం చేసారుట‌. అప్పుడు త‌న‌కు ఫుల్ గా సినిమాలు ఉన్నాయ‌ని...డేట్లు స‌ర్దుబాటు  చేయ‌డం క‌ష్టం అవుతుంద‌ని అత‌న్ని ఒప్పించి పంపించేసిన‌ట్లు తెలిపారు. అయితే సినిమా రిలీజ్ అయిన త‌ర‌వాత‌ ఆ పాత్ర తానెందుకు చేయ‌లేద‌ని చాలా బాధ‌ప‌డిన‌ట్లు భ‌ర‌ణి రియ‌లైజ్ అయ్యారు.  ఇలాంటి పాత్ర‌లు అరుదుగా పుడ‌తాయ‌ని వ‌ర్మ లాంటి వారే అలాంటి పాత్ర‌ల్ని సృష్టించగ‌ల‌రని కొనియాడారు. మొత్తానికి వ‌ర్మ మ‌రోసారి మ‌రో దిగ్గ‌జ న‌టుడితో శభాష్ అనిపించుకున్నారు. ఆర్జీవీ మొద‌టి సినిమా శివ‌కు త‌నికెళ్ల భ‌ర‌ణి సంభాష‌ణ‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఈ జోడీ చాలా సినిమాల‌కు క‌లిసి ప‌ని చేశారు. భ‌ర‌ణి త‌న సినిమాల్లో ర‌చ‌యిత‌గా న‌టుడిగానూ స‌త్తా చాటారు.
Tags:    

Similar News