ఫ్యాషన్ లో ఎక్కడా తగ్గవుగా పుష్పా! అందుకేగా స్టైల్ ఐకాన్!!.. బన్ని ఈ కొత్త టీషర్ట్ ని ఆ గెటప్ ని చూసాక ఎవరైనా ఇలా కామెంట్ చేయకుండా ఉండగలరా? ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనాన్ని స్టైల్ కంటెంట్ ని అభిమానులకు పరిచయం చేయకపోతే ఎవరూ గుర్తుంచుకోరు. నేటితరంలో ఎందరు హీరోలు ఉన్నా విజయ్ దేవరకొండను ప్రత్యేకంగా అభిమానులు గుర్తు పెట్టుకోవడంలో లాజిక్ ఇదే. అయితే దేవరకొండకు స్ఫూర్తి అల్లు అర్జున్.. రణవీర్ సింగ్ లాంటి స్టార్లు. ఆ ఇద్దరినీ అనుకరించేందుకు విజయ్ ఇష్టపడతాడు. బన్నీ అన్న అంటే అపారమైన ప్రేమ అభిమానం అతడికి. తన స్టైల్ కంటెంట్ కి అన్నే స్ఫూర్తి అంటాడు.
ఏదైతేనేం ఇప్పుడు బన్ని తొడుక్కున్న ఆ టీ చొక్కాయ్ యూత్ ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇది ఎంతో ట్రెండీగా ఆకర్షిస్తోంది. బులుగు జిలుగు టీషర్ట్.. దానిపై దీపిక పదుకొనే లాంటి అమ్మాయి మంటలు పుట్టిస్తుంటే ఆ కిందనే తనని చూస్తూ ఉన్న ప్రభాస్ లాంటి కుర్రాడి గుండెల్లో బీటలు వారినట్టు భూకంపం వచ్చినట్టు ఆ షర్ట్ పై చాలా మీనింగ్ గోచరించింది.
మొత్తానికి స్టైల్ ఐకాన్ కోసం డిజైన్ చేసిన ఆ డిజైనర్ ఎవరో అంటూ చర్చ సాగేలా చేసింది ఈ షర్ట్. కాంబినేషన్ గా బ్లాక్ ఆర్మీ స్టైల్ ట్రాక్ సూట్ ధరించిన అతడు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే పుష్పరాజ్ వేషధారణ ఏదీ మారలేదు. ఆహార్యం అలాగే గుబులు పుట్టిస్తోంది. అదే గుబురు గడ్డం పెరిగిన రింగుల జుత్తు.. కళ్లద్దం.. వగైరా వగైరా వేషంలో మాసీగా కనిపిస్తున్నాడు. ఏదైనా పుష్ప స్టైల్ కంటెంట్లో తగ్గేదేలే!!
పుష్ప నెక్ట్స్ ఏంటీ?స్టైల్ కంటెంట్ మాట అటుంచితే.. ప్రస్తుతం పుష్ప 2 కోసం సన్నాహకాల్లో ఉన్నాడు బన్ని. ఈ సినిమా స్క్రిప్టు కోసం సుకుమార్ చాలా సమయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పార్ట్ 1 ఘనవిజయం సాధించాక.. పుష్ప 2 కాన్వాస్ అమాంతం మారింది.
యాక్షన్ పదింతలైంది. పాన్ ఇండియా మార్కెట్లో దుమ్ము దులిపేయాలన్న లక్ష్యంతో దీనిని రూపొందించనున్నారు. అయితే స్క్రిప్టు కోసమే ఇంత సమయం తీసుకోవడంతో ఈ గ్యాప్ లో బన్ని ఒక చిన్న సినిమా చేయాలనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమర్థవంతమైన స్క్రిప్టు దొరికితే తక్కువ సమయంలో పరిమిత బడ్జెట్లో ఓ సినిమా చేయాలనేది బన్ని ప్లాన్ అని తెలిసింది.
పుష్ప చిత్రం ఆలస్యంగా మొదలవుతోంది కాబట్టి డిసెంబర్ 2023లో మాత్రమే విడుదలవుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే బన్ని ఈలోగానే వేరొక చిన్న సినిమాలో నటించే వీలుందిట. ఓవైపు దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ చేయాల్సి ఉన్నా కానీ దానిపై బన్ని ఆసక్తిని కనబరచడం లేదు. ఆ మూవీ ప్రస్తుతానికి పెండింగ్ లోనే ఉండిపోయింది. ఇక లోబడ్జెట్ మూవీ స్క్రిప్టు దర్శకుడు ఓకే అయితే బన్నీ టీమ్ ప్రకటించే వీలుందని కూడా టాక్ వినిపిస్తోంది.