అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `అల వైకుంఠపురము లో..` త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం పారిస్ లోని కీలక లొకేషన్ లలో `సామజ వరగమన..` సాంగ్‌ని హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హేగ్డేల పై చిత్రీకరిస్తున్నారు. ఈ పాట లో పారిస్ కు చెందిన లిండో డ్యాన్సర్స్ ప్రత్యేకంగా కనిపించబోతున్నారు. పారిస్ లో లిండో డ్యాన్స్ అంటే అమితంగా ఇష్టపడతారు. గత 30 ఏళ్లుగా లిండో డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్న ఈ డ్యాన్సర్స్ సామజ వరగమన సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణ గా నిలవబోతున్నారు.
భారతీయ చిత్రాలు ఇప్పటి వరకు ఎన్నో పారిస్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. అయితే వారి సంప్రదాయ నృత్యాన్ని, ఆ డ్యాన్సర్స్ ని మాత్రం ఏ సినిమా లోనూ చూపించలేదు. అలా చూపించిన తొలి హీరో సినిమాగా అల్లు అర్జున్ నటిస్తున్న `అల వైకుంఠపురము లో..` అరుదైన ఘనతను సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిని `సామజ వరగమన` లిరికల్ వీడియో ఏ స్థాయిలో పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని విజువల్ గా ప్రేక్షకులు భారీ స్థాయిలో ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఈ పాటని లిండో డ్యాన్సర్స్ తో చేయిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
త్రివిక్రమ్అల్లు అర్జున్ ముచ్చటగా మూడవసారి కలసి పనిచేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ పోటీ వున్నా జనవరి 12న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ పోటీపడుతున్నారు.