బాబూ సుధీర్.. ఏంటీ సాహసాలు?

Update: 2015-12-02 13:30 GMT
మహేష్ బావ సుధీర్ బాబు గురించిం అందరూ ఇచ్చే కాంప్లిమెంట్.. అతడు సినిమాల కోసం విపరీతంగా కష్టపడతాడని. మహేష్ కూడా ఎప్పుడూ ఆ మాటే అంటుంటాడు. సినిమాల కోసం తన ఫిజిక్ ను మార్చుకున్న తీరు.. డ్యాన్సులు, ఫైట్ల విషయంలో అతడు పడే కష్టం ప్రేక్షకులకు కూడా తెలుసు. అందులోనూ బాలీవుడ్ సినిమా ‘భాగి’ కోసమైతే విపరీతంగా శ్రమిస్తున్నాడు సుధీర్. ఈ మధ్య ఫైటర్లతో కలిసి ట్రైనింగ్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో అతడి విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సుధీర్ ఇంత కష్టపడుతున్నాడా అనుకున్నారు.

ఐతే అలా కష్టపడే క్రమంలో సుధీర్ కు గాయాలు కూడా అవుతున్నాయి. 'భాగి' సినిమా షూటింగ్ లో అతడి చేతికి పెద్ద గాయమే అయింది. ఆ గాయాన్ని చూపిస్తూ ట్విట్టర్ లో ఓ ఫొటో కూడా పెట్టాడు సుధీర్. ఈ సినిమా కోసం భారీ క్లైమాక్స్ ప్లాన్ చేశామని.. దాని కోసం రిహార్సల్స్ చేస్తుండగా గాయమైందని సుధీర్ చెప్పాడు. ‘భాగి’ సినిమా కోసం ప్లాన్ చేసిన యాక్షన్ సీన్స్ తాను హాలీవుడ్ లో కూడా చూడలేదని అంటున్నాడు సుధీర్. జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భాగి’లో సుధీర్ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. అతను హీరోగా తెరకెక్కిన తెలుగు సినిమా 'భలే మంచిరోజు' ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
Tags:    

Similar News