నెలలు, సంవత్సరాల తరబడి పడ్డ కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో చూసుకోబోయే ముందు ఉద్వేగం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే సుధీర్ బాబుకు ఈ ఉద్వేగంలో కన్నీళ్లు కూడా వచ్చేశాయట. తెలుగులో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో శ్రమించి ఆ ప్రయత్నంలో కొంతవరకు విజయవంతమైన సుధీర్.. బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘భాగి’ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. దీని థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. ఇందులో సుధీర్ బాబు లుక్ కానీ.. అతడి అప్పీయరెన్స్ కానీ మౌండ్ బ్లోయింగ్ అనే చె్ప్పాలి. దీంతో టాలీవుడ్ సెలబ్రెటీలు, ఇక్కడి జనాలు సుధీర్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు.
అసలు ట్రైలర్ అప్ లోడ్ చేస్తున్నపుడే ఉద్వేగంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయని చెప్పిన సుధీర్.. జనాల స్పందన చూసి ఇంకా ఎమోషనల్ అయ్యాడు. ‘‘ఎక్కడో బాలీవుడ్ లో ఓ ఛాలెంజింగ్ రోల్ కోసం వెతుక్కుంటూ ఓ తెలుగువాడిని తీసుకుపోయారు. మనం ఎవరికీ తక్కువ కాదు’’ అంటూ ఇంకో ట్వీట్ చేశాడు సుధీర్. ఈ సినిమా కోసం సుధీర్ ఎంతో కష్టపడి.. చిజిల్డ్ బాడీ పెంచాడు. బాలీవుడ్ కండల వీరులకు ఏమాత్రం తీసిపోని రీతిలో తన బాడీని తీర్చిదిద్దుకున్నాడు. కేవలం బాడీ పెంచడమే కాకుండా.. యాక్షన్ సన్నివేశాల కోసం కొన్ని నెలల పాటు ప్తర్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు సుధీర్. అతడి కష్టం ట్రైలర్లో కనిపిస్తోంది. తెలుగు హిట్ మూవీ ‘వర్షం’కు రీమేక్ గా చెబుతున్న ఈ సినిమా సుధీర్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.