టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే బాలీవుడ్లో ‘బాఘి లాంటి భారీ సినిమాలో విలన్ పాత్ర పోషించి ఆశ్చర్యపరిచాడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు. ఈ పాత్ర సుధీర్ ను ఎలా వరించిందనే విషయం పెద్ద సస్పెన్సే. ఇక్కడ హీరోగా చేస్తూ అక్కడ విలన్ అవతారం ఎత్తడమూ ఆశ్చర్యమే. ఐతే తనకు ఆ అవకాశం ఎలా వచ్చింది.. తానెందుకు ఆ పాత్ర ఎంచుకుంది వివరించాడు సుధీర్. ‘‘ఎస్.ఎం.ఎస్ సినిమా కోసం చేసిన కొన్ని స్టంట్లకు సంబంధించిన వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేశాను. అవి నచ్చడంతో బాఘి కోసం నన్ను ఆడిషన్ కు రమ్మన్నారు. ముందు ఏదో చిన్న పాత్ర అయి ఉంటుందనుకుని నో చెప్పాలనుకున్నా. కానీ కథ నచ్చి.. విలన్ పాత్ర అనడంతో ఓకే అనేశాను’’ అని సుధీర్ చెప్పాడు.
బాఘి సినిమాలో తన పాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందని సుధీర్ చెప్పాడు. ‘‘నా బాలీవుడ్ ఎంట్రీపై ముందు నెగటివ్ కామెంట్స్ వినిపించాయి కానీ సినిమా ట్రైలర్ చూశాక జనాల అభిప్రాయం మారింది. సినిమా చూసి అందరూ బాగుందంటున్నారు. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఫోన్ చేసి మరీ అభినందించారు’’ అన్నాడు. తన తర్వాతి ప్రాజెక్టుల గురించి చెబుతూ.. ‘‘భలే మంచి రోజు కో డైరెక్టర్ శ్రీరామ్ రెడ్డి దర్శకత్వంలో తెలుగులో ఓ సినిమా చేస్తున్నా. ఈ సినిమా మే నెలాఖరున మొదలవుతుంది. పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను తెలుగు - హిందీ భాష ల్లో చేయాలనుకుంటున్నాం. నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఆ పాత్ర కోసం పెద్ద కష్టపడనక్కర్లేదు. ఈ సినిమాను నిర్మించడానికి పెద్ద పెద్ద బేనర్లు ముందుకొస్తున్నాయి’’ అని సుధీర్ చెప్పాడు.