సుశాంత్ మరణానికి బాధ్యులను చేస్తూ బాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు...!

Update: 2020-06-17 11:50 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎంతో భవిష్యత్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుశాంత్ బలవన్మరణానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు బాధ్యులు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కొంతమంది నెపోటిజం ని ఎంకరేజ్ చేస్తూ టాలెంట్ ని తొక్కేస్తున్నారని విమర్శలు చేస్తూ వచ్చారు. కంగనా రనౌత్, ప్రకాష్ రాజ్, అభినవ్ కశ్యప్ లాంటి వారు దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యంగా కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ లాంటి వారు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యగ్రౌండ్ లేకుండా వచ్చిన వారిని ఎదగనివ్వరని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియా మాధ్యమాల్లో వారిని అన్ ఫాలో చేస్తూ నిరసన తెలుపుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా సుశాంత్ మరణానికి బాలీవుడ్ ప్రముఖులు కారణం అంటూ బీహార్ ముజఫర్ పూర్ కోర్ట్ లో కేసు ఫైల్ అయింది. సుధీర్ కుమార్ ఓఝా అనే అడ్వకేట్ బాలీవుడ్ సెలబ్రిటీస్ కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ తో పాటు మరో నలుగురిని సుశాంత్ మృతికి బాధ్యులను చేస్తూ ఐపీసీ సెక్షన్స్ 306, 109, 504 మరియు 506 క్రింద కేసు ఫైల్ చేశారు. లాయర్ సుధీర్ కుమార్ ఓఝా మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి 7 సినిమా అవకాశాలను దూరం చేసారని.. అతని సినిమాలు విడుదలను అడ్డుకున్నారని.. ఈ విధంగా అతను బలవన్మరణం పొందేలా ప్రేరేపించారని.. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ తో పాటు మొత్తం 8 మందిపై కేస్ ఫైల్ చేశానని పేర్కొన్నారు. మరి దీనిపై బాలీవుడ్ బిగ్గీష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ నిరుపన్ ''సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ 'చిచోరే' సక్సెస్ తర్వాత 7 చిత్రాలకు సంతకం చేశారు. అయితే 6 నెలల్లో అన్ని సినిమాలు అతని చేతి నుండి జారిపోయాయి. ఎందుకు? చిత్ర పరిశ్రమ యొక్క క్రూరత్వం వేరే స్థాయిలో పనిచేస్తుంది. ఈ క్రూరత్వం ప్రతిభావంతులైన యాక్టర్ ని చంపింది'' అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News