సుక్కు తీసేసి కనిపించాడే

Update: 2017-11-08 05:02 GMT

దర్శకుడు సుకుమార్ గత ఏడాది కాలంగా గెడ్డం లుక్ తోనే కనిపిస్తున్నాడు. చెర్రీతో సినిమా అనుకున్న దగ్గర నుంచి.. చరణ్ ను గెడ్డం పెంచమని చెప్పినప్పటి నుంచి సుక్కు కూడా గెడ్డం పెంచుతూనే ఉన్నాడు.

మరోవైపు గతేడాది నుంచి నోషేవ్ నవంబర్ అనే ట్రెండ్ కూడా మనోళ్లు బాగానే ఫాలో అయ్యారు. చరణ్ సినిమా కోసం గెడ్డం పెంచితే.. మంచు విష్ణు.. రానా.. వరుణ్ తేజ్ వంటి హీరోలు కూడా నోషేవ్ నవంబర్ ను ఫాలో అయ్యారు. అయితే.. సుక్కు - చెర్రీలు మాత్రం ఇప్పటివరకూ గెడ్డం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కానీ రీసెంట్ గా మొదలైన షెడ్యుల్ లో సుకుమార్ గెడ్డం తీసేసి.. కేవలం ఫ్రెంచ్ కట్ తో మాత్రమే కనిపించాడు. నిజానికి భారీగా పెరిగిన గుబురు గెడ్డాన్ని మెయింటెయిన్ చేయడం అంత సులభం కాదు. నిర్వహణ పరంగా చాలానే సమస్యలుంటాయి. పైగా ఇబ్బందిగా కూడా ఉంటుంది.

ఇప్పుడు దాదాపుగా షూటింగ్ పూర్తి కావస్తున్న సమయంలో సుక్కు ఈ గెడ్డం లుక్ నుంచి బయటకు వచ్చేసి.. సినిమా పనులపై కాన్సంట్రేట్ చేయదలచుకున్నాడు. కానీ షూట్ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకూ గెడ్డం తీసేసే ఛాన్స్ రామ్ చరణ్ కు మాత్రం లేదు. అందుకే ఇంకా తన లుక్ ను అలాగే కొనసాగిస్తున్నాడు.
Tags:    

Similar News