సుక్కు లవ్వు సరే..దేవీ నిలబెట్టుకుంటాడా?

Update: 2019-12-26 17:30 GMT
కొంతమంది డైరెక్టర్లకు కొంతమంది హీరోలతో.. టెక్నిషియన్స్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది.  అందుకే వారి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఆ ప్రభావం కనిపిస్తుంది..  ఆ క్వాలిటీనే వేరేగా ఉంటుంది.  క్రియేటివ్ ఫిలింమేకర్ సుకుమార్ సినిమాలకు సహజంగా టెక్నిషియన్లు మారరు. మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడూ దేవీ శ్రీప్రసాద్.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఫిక్స్. వారు అందుబాటులో లేకపోతే వేరే టెక్నిషియన్లతో పని చేస్తారేమో కానీ ఫస్ట్ ఛాయిస్ మాత్రం ఎప్పుడూ వారే.

అయితే ఈమధ్య దేవీ శ్రీప్రసాద్ ఫామ్ లో లేడు. ఎవరు ఎంత వెనకేసుకు రావడానికి చూసినా దేవీ నుంచి టాప్ క్వాలిటీ ట్యూన్స్ రావడం లేదన్నది నిజం. 'సరిలేరు నీకెవ్వరు' పాటలు సూపర్ అని మాత్రం అనిపించుకోలేకపోతున్నాయి. అయినా సుక్కు మాత్రం దేవీనే #AA20 సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు.  అంతే కాదు దేవీపైన తన అభిమానాన్ని.. ప్రేమను అసలేమాత్రం దాచుకోడు సుక్కు.  రీసెంట్ గా 'ప్రతిరోజు పండగే' థ్యాంక్స్ మీట్ లో మాట్లాడుతూ సంగీత దర్శకుడు థమన్ ను మెచ్చుకుంటూనే "ఏడుపో తెలీదు నవ్వో తెలీదు..ఆడియన్స్ సినిమా చూసినప్పుడు నవ్వుతూ ఉంటారేమో కానీ అలాంటి సీన్లు ఉండే సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెయ్యడం మ్యూజిక్ డైరెక్టర్ కు చాలా కష్టం. ముఖ్యంగా ఫైట్ బీజీఎం అదిరిపోయింది. బాబాయ్ పాట సూపర్బ్.. దేవీ ఫ్యాన్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు నీకు"అంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.  

థమన్ మ్యూజిక్ ను మెచ్చుకుంటూనే ఇలా దేవీకి ఫ్యాన్ అని చెప్పడం అది దేవీకి  సుక్కు ఇచ్చిన గౌరవమే. అయితే దేవీ చూస్తే ఇప్పుడు అసలు ఫామ్ లో లేడు. #AA20 సినిమాకు ఇచ్చే మ్యూజిక్ కనుక అంచనాలు అందుకోలేకపోతే దేవీ ఇమేజ్ ప్రేక్షకుల్లో పలుచన కావడం ఖాయం.  మరి సుక్కు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.


Tags:    

Similar News