తెలుగు సినిమాలందు సుకుమార్ సినిమాలు వేరయా అనుకోవచ్చు. మన దగ్గర భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాల్లో ‘కాన్సెప్ట్స్’ అనేది అస్సలు కనిపించదు. మామూలుగానే మనదగ్గర కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తక్కువ అంటే.. ఇక కమర్షియల్ సినిమాల్లో వాటి గురించి ఆలోచించడం వృథా. ఐతే సుకుమార్ ఒక్కడు మాత్రం దీనికి మినహాయింపు. ఓ కాన్సెప్ట్ తో సినిమాలు నడిపించడం అతడి ప్రత్యేకత. టైటిల్స్ దగ్గర్నుంచే ఆ కాన్సెప్ట్ అన్నది కనిపిస్తుంది. సినిమా అంతా అది రన్ అవుతూ ఉంటుంది. అందులోనూ ‘1 నేనొక్కడినే’ దగ్గర్నుంచి ఈ విషయంలో సుకుమార్ మరింత ప్రత్యేకత చూపిస్తున్నాడు. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’లో ఆయన డిస్కస్ చేసిన బటర్ ఫ్లై ఎఫెక్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ అంటూ ఆయన చెప్పిన కాన్సెప్ట్ జనాలకు నచ్చింది. ఐతే ఈ కాన్సెప్ట్ తో సినిమా తీయడం వెనుక ఓ విషాద గాథ ఉందంటున్నాడు సుక్కు.
సుకుమార్ కు రామ్మోహన్ రెడ్డి అనే గురువుండేవాడట. ఆయన కొడుకు సుక్కుకి ఫ్రెండ్ అట. ఐతే ఆ ఫ్రెండు యాక్సిడెంట్లో చనిపోయాడని.. అతడి మరణానికి తాను కూడా పరోక్షంగా కారణమని అంటున్నాడు సుక్కు. ‘‘అతను హైదరాబాద్ రావడం కోసం నాకు ఫోన్ చేశాడు. నేను మూడు రోజులు ఆగి రమ్మన్నా. ఆ గ్యాప్ లోనే యాక్సిడెంట్ జరిగింది. అలా నేను కూడా పరోక్షంగా అతడి మరణానికి ఓ కారణం. ఇంకా ఇందులో చాలా పర్ముటేషన్స్ - కాంబినేషన్స్ ఉన్నాయి. నిజానికి యాక్సిడెంట్ జరిగిన రోజు నా ఫ్రెండుని మా గురువుగారు కాలేజీకి వెళ్లొద్దన్నారు. కానీ అతను వెళ్లాడు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి చెన్నై నుంచి కార్లో వచ్చాడు. నిజానికి అతను ఫ్లైట్లో రావాలనుకున్నాడు. కానీ టికెట్ దొరక్క కార్లో వచ్చాడు. అతడికి చెన్నైలో టికెట్ దొరికి ఉన్నా.. నా ఫ్రెండు తన తండ్రి మాట విని కాలేజీకి వెళ్లకపోయి ఉన్నా.. లేక నేను మూడు రోజులు లేటుగా కాకుండా వెంటనే హైదరాబాద్ వచ్చేయమని చెప్పి ఉన్నా అతను బతికేవాడు. సినిమాలో ‘ఎక్కడో జరిగే ఓ మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఇంకో మూమెంట్ ను డిసైడ్ చేస్తుంది’ అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. నా ఫ్రెండు ఎపిసోడ్ తోనే బటర్ ఫ్లై ఎఫెక్టుని సినిమాలో డిస్కస్ చేశా’’ అని చెప్పాడు సుక్కు.