ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమా పేరును ''రంగస్థలం 1985'' అని పెట్టేశారు. అయితే ఇక్కడ ఈ టైటిల్ చాలామందికి ఇష్టం లేదని.. కాని డైరక్టర్ సుకుమార్ మన మెగా హీరోను ఒప్పించి పెట్టించాడనే రూమర్ ఉండనే ఉంది. అయితే ఈ టైటిల్ వింటేనే ఇప్పుడు ఇదో వింటేజ్ కథ తాలూకు సినిమా అని అర్ధమైపోతోంది. దీని గురించి ఈరోజు సుకుమార్ భలే ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశాడు.
సంక్రాంతి రిలీజ్ కోసం ముస్తాబవుతున్న రంగస్థలం సినిమా.. ఆల్రెడీ 50% షూటింగ్ పూర్తి చేసుకుందని చెబుతున్నాడు సుకుమార్. ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం చెబుతూ.. ''నిజానికి కథాపరంగా ఆ సమయానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మొబైల్ ఫోన్స్ లేని కాలం కావాలని అనుకున్నాం. అందుకే 1985 అంటేనే మా సినిమా వర్కవుట్ అవుతోంది. సో కథ కోసమే వెళ్ళాను'' అని చెప్పాడు సుకుమార్. అంతేకాదు.. తాను పాతికేళ్ళు విలేజీలోనే పెరిగాడు కాబట్టి.. ఆ బ్యాక్ డ్రాపులో సినిమా తీద్దాం అని ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాడట. ''గతంలో ఆర్య వంటి సిటీ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో కూడా నేను పళ్ళెటూరి సీన్స్ పెట్టాను. 100% లవ్ లో కూడా అవి తీశాను. ఇప్పుడు అవే ఈ సినిమా కోసం పూర్తి స్థాయిలో తీస్తున్నాను'' అంటున్నాడు సుకుమార్.
ఇప్పటివరకు సమంత కాని.. రామ్ చరణ్ కాని తమ కెరియర్లో ఎప్పుడూ చేయనటువుంటి రోల్స్ ఈ సినిమాలో చేస్తున్నారట. అంతేకాదు సుకుమార్ మరో ప్రామిస్ కూడా చేశాడు. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు ఏమీ మిస్సవ్వట్లేదట. సో 1985 సినిమా అనిగానే భయపడక్కర్లేదు.