ఎన్టీఆర్ లీలలు ఒక్కొక్కటి కాదు

Update: 2016-01-25 09:30 GMT
ఎన్టీఆర్ ఓ ప్రేమ తుఫాన్.. దాన్నుంచి బయటికి రావడం ఈజీ కాదని ఆ మధ్య అన్నాడు సుకుమార్. నిజంగానే ఆ తుఫాన్ నుంచి సుక్కు బయటికి రాలేకపోతున్నట్లే ఉంది. ‘నాన్నకు ప్రేమతో’కు సంబంధించి ఎక్కడ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు సుక్కు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విషయంలో తీసుకున్న చొరవ.. అతడి పెర్ఫామెన్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు సుక్కు.

‘‘ఇంటర్వెల్ సీన్లో జగపతిబాబుతో కాన్వర్జేషన్ అయిపోయాక ఎన్టీఆర్ వెనక్కి తిరిగి నడుచుకెళ్లిపోయే సీన్ ఉంటుంది. మామూలుగా అయితే ఓ మాస్ హీరో ఆ సీన్ చేస్తే కెమెరా అతడి ముందు వైపు ఫోకస్ అవుతుంది. చాలా బిల్డప్ ఉంటుంది. ఐతే నేను మాత్రం ఎన్టీఆర్ ను జస్ట్ అలా వెనక్కి తిరిగి నడుచుకెళ్లిపో చాలు అన్నాను. దానికి అతను అభ్యంతరం చెబుతాడు అనుకున్నా. కానీ ఎన్టీఆర్ మాత్రం చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ సీన్ అయిపోయాక నా దగ్గరికి వచ్చి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తాడనుకున్నా. పావు గంట ఎదురు చూశా. కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ సీన్లోనే ఎన్టీఆర్ ఓ స్మైల్ ఇచ్చాడు. దాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. కొందరు హీరోలు కూడా ఫోన్ చేసి ఏం నవ్వాడండీ అన్నారు.

ఇక ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎన్ని పాత్రలు పోషించాడో చెప్పలేను. అతను మంచి డైలాగ్ రైటర్ అని షూటింగ్ టైంలోనే తెలిసింది. నేను సెట్లోనే డైలాగులు రాసుకునేవాణ్ని. ఏదైనా డైలాగ్ కంప్లీట్ కాక ఇబ్బంది పడుతుంటే.. తను వచ్చి పూర్తి చేసేవాడు. ఇక సన్నివేశాల్లో కంటిన్యుటీ గురించి కూడా జాగ్రత్త తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర కూడా పోషించేవాడు. ‘జగపతిబాబు గారు ఆ స్టిక్ ఏంటి కుడిచేత్తో పట్టున్నారు.. ఇందాక ఎడమ చేతిలో ఉంది కదా’..  ‘రకుల్ ఆ డ్రెస్ వేసిందేమి’.. అంటూ కంటిన్యుటీ గుర్తుచేసేవాడు. ఇలాంటి మెమరీ పవర్ చాలా కొద్దిమందికే ఉంటుంది. సినిమాలో కథానాయకుడిలాగే అతనూ చాలా ఇంటలిజెంట్’’ అని సుక్కు తన హీరోను ఆకాశానికెత్తేశాడు.
Tags:    

Similar News