నాన్నకు ప్రేమతో.. ఈ సినిమా ఇప్పుడు అందరికీ బాగా నచ్చిన సినిమా. మిక్స్డ్ టాక్ తో ఓపెన్ అయినా కూడా.. మాంచి పాజిటివ్ బజ్ ను తెచ్చుకుని 45 కోట్ల మేర షేర్ వసూలు చేసింది. నేను జీవితం గుర్తు పెట్టుకునే సినిమా ఈ నాన్నకు ప్రేమతో అంటూ ఎన్టీఆర్ ఈ సినిమాను, దర్శకుడు సుక్కూను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సమయంలో ఓ మాంచి మాట చెప్పాడు.
''డైరక్టర్‌ఎందుకు క్యాప్టెన్ అనేస్తాం అంటే.. ఆయనకు అన్నీ చేస్తాడని కాదు.. ఆయన ఏం చేయాలో చెప్తాడు. ఒక సినిమా కోసం ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అనే జడ్జ్ మెంట్ ను కేవలం దర్శకుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనాలి. నాన్నకు ప్రేమతో అంటే ఖచ్చితంగా అది సుక్కూకి ప్రేమతో.. అంతా సుకుమార్ గారి క్రియేటివిటీనే. ఈ సినిమాతో ఆయన ఒక క్రియేటివ్ ఇంటెలిజెంట్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది'' అంటూ సెలవిచ్చాడు జూ.ఎన్టీఆర్.
ఇక జూనియర్ కామెంట్లపై సుకుమార్ స్పందిస్తూ.. ''ఒక స్టార్ హీరో ఇలా క్రెడిట్ అంతా దర్శకుడికి ఇచ్చేయడం అనేది చరిత్రలోనే తొలిసారి జరుగుతోందేమో. అందుకే ఈ కామెంట్లను నేను యావత్ తెలుగు సినిమా డైరక్టర్లందరి తరుపునా.. ఐ యామ్ టేకింగ్ ఇట్..'' అన్నాడు.