మెగాస్టార్ ను లైట్ తీసుకున్న సుమ..!

Update: 2023-01-17 03:56 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికి ఎంతో ఇష్టం. స్వయంకృషితో పైకొచ్చిన ఆయన్ను స్పూర్తిగా తీసుకుని చాలా మంది హీరోలుగా వచ్చారు. పదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన చిరు మళ్లీ ఇప్పుడు తన మునుపటి ఫాం ను కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా 3 రోజుల్లో 100 కోట్లు వసూళ్లను సాధించి బాక్సాఫీస్ పై చిరంజీవి సత్తా ఏంటో చూపిస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని చిరు స్పెషల్ ఇంట్రెస్ట్ మీద చేసినట్టు అనిపిస్తుంది. అదే క్రమంలో సుమ కొత్త షో సుమ అడ్డాకు చిరు గెస్ట్ గా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన మొదటి టాక్ షో ఇదే అని చెప్పొచ్చు. చిట్ చాట్ లో భాగంగా చిరు ఈ మధ్య తన సినిమాల గురించి కొన్ని లీక్స్ ఇస్తున్నారు. దాని గురించి సుమ చిరు లీక్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. అయితే మెగాస్టార్ దానికి సమాధానంగా సుమ గురించే ఒక లీక్ ఇచ్చారు. అదేంటి అంటే సుమకి 3 ఏళ్లుగా బర్త్ డే విషెస్ మెసేజ్ పెడుతున్నా తనకు రిప్లై ఇవ్వలేదని అన్నారు చిరు.

3, 4 ఏళ్లుగా సుమకి హ్యాపీ బర్త్ డే, గాడ్ బ్లెస్ యు, స్టే బ్లెస్డ్ అంటూ తాను మెసేజ్ చేస్తున్నా సుమ కనీసం రిప్లై ఇవ్వలేదని అన్నారు చిరు. చిరంజీవి మెసేజ్ పెడితే దానికి రిప్లై ఇవ్వని ఏకైక వ్యక్తి సుమనే అంటూ చిరు చెప్పారు. దానికి సుమ వివరణ ఇస్తూ చిరంజీవి గారు తనకు మెసేజ్ చేసారని ఊహించలేదు. నెంబర్ కూడా క్రాస్ చెక్ చేసుకోలేదు. 2022లో ఓ ఈవెంట్ లో కలిసి చిరు ఆ విషయాన్ని చెబితే అప్పుడు సుమ చాలా సంతోషించిందట. అప్పుడు సుమ చిరుకి సారీ చెప్పిందని అన్నారు.

స్టార్ యాంకర్ గా సుమ స్మాల్ స్క్రీన్ పై తన స్థానం పర్మినెంట్ చేసుకుంది. అయితే సుమకి కచ్చితంగా అది చిరు నెంబర్ అని తెలియదు కాబట్టే మెగాస్టార్ మెసేజ్ లకు రిప్లై ఇచ్చి ఉండదని ఆడియన్స్ కూడా కన్విన్స్ అయ్యారు. సుమ అడ్డాలో మెగాస్టార్ మెగా సందడి ఆ షోకి సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. ఇక ఓ పక్క సంక్రాంతి విన్నర్ గా చిరు బాక్సాఫీస్ పై తన దూకుడు చూపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News