హీరోగా సుమన్ సుదీర్ఘ కెరీర్ నే సాగించాడు. 80లలో ఇప్పుడున్న స్టార్ హీరోలతో సమానమైన హీరో. అతడు నటించిన సినిమాలన్నీ వేరే హీరోల సినిమాలతో పోటీ పడి మరీ ఆడేవి. చిరంజీవి, రాజశేఖర్, సుమన్, బాలకృష్ణ లీడింగ్ లో ఉన్న సందర్భమూ ఉంది. అయితే సుమన్ కెరీర్ లో అనూహ్యమైన కుదుపు. ఆ తర్వాత అతడు పూర్తిగా నటనకు కామా పెట్టాల్సొచ్చింది. కాల క్రమంలో సుమన్ తిరిగి సినిమాల్లో విలన్ వేషాలతో నెగ్గుకొచ్చాడు.
రజనీ సినిమా శివాజీ లో విలన్ క్యారెక్టర్ కి, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ కి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం చిన్నా చితకా సినిమాలు చేసినా రెగ్యులర్ గా సినిమాతో టచ్ లో ఉంటున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు సుమన్ చాలా సీరియస్ గా స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి వల్లే మీ కెరీర్ స్పాయిల్ అయ్యిందా? అన్న ఓ ప్రశ్నకు.. 'ఏం మాట్లాడుతున్నారు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ సుమన్ సీరియస్ అయ్యారు. చిరంజీవి ఆంజనేయస్వామి భక్తుడు. ఆయనెప్పుడూ చిల్లర పనులు చేయలేదు. నాకు జరిగిన ఇష్యూ లో చిరంజీవికి ఏ సంబంధం లేదు. 200శాతం ఆయన దూరంగానే ఉన్నారు. తెలుగు సినిమా హీరోకి కావాల్సిన అర్హతలన్నీ చిరులో ఉన్నాయి. అవి ఆయనకి దేవుడిచ్చిన గిఫ్ట్'' అంటూ సుమన్ క్లారిటీ ఇచ్చాడు.