హేయ్.. కామెడీ టైమింగ్ భలే పట్టిండు

Update: 2016-11-04 22:30 GMT
సుమంత్ చాలానే సినిమాలు చేశాడు. అయితే.. వీటిలో కాస్త సీరియస్ గా ఉండే రోల్స్ నే ఎక్కువగా చేశాడు. ఇప్పుడు నరుడో డోనరుడా చిత్రంతో తొలిసారిగా ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తున్నాడు. కానీ ఇలాంటి పూర్తి స్థాయికి కామెడీ చిత్రాలు చేయాలంటే.. కామెడీ టైమింగ్ ఫుల్లుగా ఉండాలి. ఈ విషయంలో ఏవైనా డౌట్స్ ఉంటే.. అలాంటివన్నీ క్లియర్ అయిపోయేలా.. తన కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఓ ఇంటర్వ్యూలో చూపించాడు సుమంత్.

ఉద్యోగంలో చేరి మొదటిసారిగా సుమంత్ నే ఇంటర్వ్యూ చేసింది ఓ మహిళా విలేఖరి. ఆ అమ్మాయిని కామెడీతో ఆడేసుకున్నాడు సుమంత్. మీరు చెప్పేదంతా రాస్కోవచ్చా అని అడిగితే.. 'మీరు కొత్త హీరోయిన్ లాంటి వాళ్లు.. అన్నీ రాసుకోవాలి' అనడం.. 'మీలాంటి కేరక్టర్స్ ఉంటారనే ఒరిజినల్ ను 100 పర్సెంట్ దింపలేదు' అనడం.. ప్రమోషన్స్ లో మీరే కనిపిస్తున్నారే అంటే.. 'అన్నిటిలోనూ వేలు పెట్టేశాను' అని చెప్పడం అదిరిపోయింది.

తాజాగా ఏమైనా డొనేట్ చేశారా అనే ప్రశ్న ఎదురైతే..' సినిమాలో డొనేట్ చేశానండీ.. ఇంక ఎంత డొనేట్ చేయను.. నేను మనిషినండీ..' అన్న సుమంత్.. మొదటి ముద్దుపై ప్రశ్న అడిగి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి సైలెంట్ గా ఉండడంతో' ఫస్ట్ కిస్ గురించి అని అడిగినపుడు నొక్కాలి.. గుచ్చాలి.. దాన్నే పట్టుకుని హైలైట్ చేయాలి.. రీరికార్డింగ్ చేయాలి' అంటూ పంచ్ లు అదరగొట్టేశాడు. సుమంత్ కామెడీ టైమింగ్ సూపర్బ్ అంటే సూపర్ అంతే. ఇంతగా కామెడీ చేయగలిగినపుడు.. ఫ్యూచర్ లో కూడా కామెడీ సినిమాలు చేస్తే బాగుంటుంది కదా సుమంత్! .

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News