ఇండియన్ సినిమా చరిత్రను తిరగేస్తే ``బాహుబలి ముందు.. బాహుబలి తర్వాత!`` అని విశ్లేషిస్తే తప్పేం కాదు. సౌత్ నుంచి వచ్చిన మొనగాడు.. బాలీవుడ్ కే పాఠాలు నేర్పించాడని తరణ్ ఆదర్శ్ అంతటి క్రిటిక్ పొగిడేశారంటే అర్థం చేసుకోవాలి. దర్శకధీరుడు రాజమౌళి & టీమ్ బాహుబలి సిరీస్ ని ఆ రేంజులో సక్సెస్ చేసింది. ఈ సినిమాని తెరకెక్కించిన విధానం.. మేకింగ్ వ్యాల్యూస్ - నటీనటుల ప్రదర్శన.. బడ్జెట్.. ప్రచార విధానం.. ప్రతిదీ చర్చకొచ్చాయి. ఐఐఐటీ విద్యార్థులు కేస్ స్టడీగా ఇప్పటికీ బాహుబలి పాఠాలు చదువుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలి.
అయితే ఇలాంటి సినిమాని బీట్ చేసి సత్తా చాటాలని అటు హిందీ - ఇటు సౌత్ దర్శకులు ఎంతగానో ట్రై చేశారు. అయితే వీళ్లంతా మూతులు కాల్చుకుని చివరకు చతికిలబడిపోవడం ప్రముఖంగా చర్చకొచ్చింది. ఖాన్ దాదాలకే సాధ్యం కాలేదు. అమీర్ ఖాన్ అంతటివాడే `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక యశ్ రాజ్ ఫిలింస్ టై అప్ తో చేసినా పనవ్వలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. షారూక్ అంతటివాడు `జీరో`తో అంతకుమించిన ఫీట్ వేయాలని కలగన్నాడు. ప్రయత్నం తుస్సుమంది. కనీసం మరో సౌత్ వాడి వల్ల అయినా అవుతుందా.. బాహుబలిని కొట్టేయడం? అంటూ ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇటీవల రిలీజైన `ఊరి- ది సర్జికల్ స్ట్రైక్` చిత్రం 24 రోజుల తర్వాత కానీ బాహుబలి 2 హిందీ (ఓన్లీ హిందీ) రికార్డును అధిగమించ లేకపోయింది.
ఇకపోతే సౌత్ వరకూ పరిశీలిస్తే .. ఇదివరకూ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన `ఓడియన్` లాంటి ప్రయోగం కనీసం బాహుబలి దరిదాపుల్లో కనిపించలేదు. ఆ సినిమా సొంత భాష మలయాళం వరకూ ఓకే కానీ - ఇతర భాషల్లో ఏమీ చేయలేకపోయింది. ప్రస్తుతం ప్రియదర్శన్ తో కలిసి లాల్ చేస్తున్న భారీ ప్రయోగం `మరక్కార్` కోసం 300కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమా `బాహుబలి` రికార్డుల్ని టచ్ చేస్తుందా.. లేదా? అన్నది రిలీజ్ తర్వాత తేల్తుంది. అయితే వీళ్లందరి మాటేమో కానీ - శంకర్ అంతటి వాడే రజనీకాంత్ - అక్షయ్ కాంబినేషన్ లో 2.0 చిత్రం తీసి బాహుబలి రికార్డుల్ని కొట్టేస్తాడనుకుంటే - ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించింది. పెట్టిన పెట్టుబడుల్ని తిరిగి పూర్తిగా రాబట్టుకోలేక చతికిల బడింది. బాక్సాఫీస్ వద్ద 400కోట్ల లోపు షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇన్ని ఎగ్జాంపుల్స్ నడుమ సుందర్ .సి అనే దర్శకుడు చేసిన ఓ ప్రయత్నం అంతే పెద్ద రేంజులో బెడిసి కొట్టడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఖుష్బూ భర్తగా పాపులరైన సుందర్.సి పులిని చూసి నక్క వాతను పెట్టుకున్న చందంగా చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన బాహుబలి -1 సక్సెస్ చూసి `సంఘమిత్ర` అనే భారీ ప్రాజెక్టును ప్రారంభించాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న సినిమాగా ప్రచారం చేశాడు. కేన్స్ లో ఘనంగా ఓపెనింగ్ చేసి ఆ తర్వాత బడ్జెట్లు లేక విఫలమయ్యాడు. క్లారిటీ లేని దర్శకుడు అన్న ముద్ర పడిపోయింది దాంతో. ఆ తర్వాత ఆయన తీసిన `కలగలప్పు 2` డిజాస్టర్.. అటుపై `అత్తారింటికి దారేది` రీమేక్ `వందా రాజా దా వరువేన్` అంతే పెద్ద ఫ్లాప్ అయ్యి ఆయన పేరు చెడగొట్టాయి. ఇలాంటి చిన్న సినిమాలకే తికాణా లేదు.. బాహుబలి ని కొట్టే సినిమా తీస్తాడా? అంటూ ప్రస్తుతం జోకులు పేల్తున్నాయ్..!! అయినా బడ్జెట్లు ఉంటే సరిపోతుందా? ప్లానింగ్.. సంకల్ప బలం కావాలి. అవేవీ రాజమౌళి టీమ్ కి కుదిరినట్టు అందరికీ కుదిరేస్తాయనుకుంటే పొరపాటే.