వీడియోః మర్యాద రామన్న జంట మాస్‌ స్టెప్స్‌

Update: 2021-04-26 08:22 GMT
పదేళ్ల క్రితం వచ్చిన మర్యాద రామన్న సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సునీల్‌ హీరోగా సలోని హీరోయిన్‌ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సునీల్‌ ఆ సినిమాతో ఫుల్‌ టైమ్‌ హీరోగా మారిపోయిన విషయం తెల్సిందే. సలోనితో మళ్లీ ఇన్నాళ్లకు సునీల్‌ ఒక సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా మర్యాద కృష్ణయ్య అనే టైటిల్‌ తో రాబోతుంది. సలోనితో సునీల్ హిట్ కాంబో అవ్వడంతో మర్యాద కృష్ణయ్య తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మర్యాద కృష్ణయ్యకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్నారు. సునీల్‌ మరియు సలోనీలు షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. షూటింగ్ గ్యాప్‌ లో సునీల్ మరియు సలోనీ కలిసి తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించిన 'మాస్టర్‌' సినిమా లోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ మాస్టర్ కమింగ్ కు మాస్ స్టెప్పులు వేశారు. సునీల్‌ సహజంగానే మంచి డాన్సర్‌ అనే విషయం తెల్సిందే. ఆయన డాన్సింగ్‌ గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదు అని ఈ వీడియోను చూస్తుంటే అర్థం అవుతుంది.

సునీల్‌ మరియు సలోనీలను చూస్తుంటే మర్యాద రామన్న సినిమాలో చూసినట్లుగానే అనిపిస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి మాస్‌ స్టెప్పులకు అభిమానులు సూపర్బ్‌ అంటూ ప్రశంసిస్తున్నారు. సునీల్ లుంగీలో సలోనీ చీరలో వేసిన మాస్‌ స్టెప్పులు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో మాదిరిగా వీరి కాంబోలో రాబోతున్న మర్యాద కృష్ణయ్య సినిమా కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News