టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా ఆయన్ను ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. అతి చిన్న వయసులోనే స్టార్ గా ఎదిగిన ఉదయ్ కిరణ్ ఎంత స్పీడ్ గా ఎదిగాడో అంతకు మించిన స్పీడ్ తో డౌన్ ఫాల్ కు గురయ్యాడు. కెరీర్ లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల ఉదయ్ కిరణ్ కెరీర్ అర్థాంతరంగా ఆగిపోవడంతో పాటు ఆయన చివరకు ఆత్మహత్య చేసుకునే వరకు వచ్చింది.
ఉదయ్ కిరణ్ మృతి చెందిన తర్వాత కూడా ఆయన తో వర్క్ చేసిన ఎంతో మంది టెక్నీషియన్స్ నటీనటులు ఆయన్ను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. ఆయన పడ్డ కష్టం గురించి ఆయన ఆ సమయంలో షూటింగ్ లో చేసిన సాహసాల గురించి ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు. ఈసారి ఉదయ్ కిరణ్ జ్ఞాపకాల్లో సునీల్ నిలిచాడు. ఉదయ్ కిరణ్ తో సునీల్ చాలా సినిమాలే చేశాడు. వీరిద్దరి కాంబోలో మంచి కామెడీ సీన్స్ పండాయి. ఇప్పటికి అవి యూట్యూబ్ లో కనిపిస్తూనే ఉంటాయి.
తాజాగా సునీల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ సినిమా కోసం ఏ స్థాయిలో కష్టపడేవాడో చెప్పాడు. నువ్వు నేను షూటింగ్ కోసం దర్శకుడు తేజ రన్నింగ్ సీన్ ను చిత్రీకరించాలనుకున్నారు. అందుకోసం ప్రొఫెషనల్ రన్నర్స్ ను రంగంలో కి దించాడు. వారితో రన్ చేసి ఉదయ్ కిరణ్ గెలవాల్సి ఉంటుంది. సీన్ ప్రారంభించిన తర్వాత ఉదయ్ కిరణ్ నిజంగానే ప్రొఫెషనల్ రన్నర్స్ ను బీట్ చేసి మరీ పరిగెత్తాడు. అంత స్పీడ్ గా ఎలా పరిగెత్తావని అడిగితే అప్పట్లో బస్సుల వెనుక పరిగెత్తే వాడిని... అదే అనుభవం తో షాట్ కోసం పరిగెత్తానంటూ కామెడీ చేశాడు. ఉదయ్ కిరణ్ చాలా జోవియల్ గా ఉండేవాడు. షూటింగ్ సెట్ లో అందరితో కలివిడిగా ఉంటూ పలకరించేవాడని సునీల్ అన్నాడు.