ఫోటో స్టోరీ: వింత నమస్కారం పెడుతోందే

Update: 2020-05-19 15:30 GMT
ఎంతో మంది హీరోయిన్లు ఉంటారు కానీ వారిలో అదా శర్మ రూటే డిఫరెంటు. అప్పుడప్పుడు వింత వస్త్రధారణతో జనాలను షేక్ చేస్తుంది. ఒకసారి పేపర్ డ్రెస్ ధరించి అహనా డ్రెస్సంట అనడంతో ఎంతో మంది నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గత కొన్ని రోజులుగా భారతీయులకు ఉన్న బంధనాలు ఒక్కొక్కటిగా తొలగిపోతుండడంతో అదా కూడా తెగ ఉత్సాహంగా ఉంది.

అదా తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ప్రస్తుతం అందరం 'తాళం కింద' లో ఉన్నాం. అది సడలించిన తర్వాత జనాలను ఎలా డిఫరెంట్ గా.. క్రియేటివ్ గా నమస్తేతో పలకరించాలా అని అలోచిస్తున్నా. మీరు ఎవరినైనా మిస్ అవుతుంటే స్వైప్ చెయ్యండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గ్రే కలర్ టాప్.. లైట్ కలర్ స్పోర్ట్స్ ప్యాంట్ ధరించి ఓ రకంగా నమస్తే పెట్టింది. దాన్ని నమస్తే అనే బదులు 'గిమస్తే' అనే 'నమస్తే -19' అనో కొత్త పేరు పెట్టుకోవాలి.

అయినా ఎక్కువమంది రెండు నెలలు 'తాళం కింద' ఉండడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అందుకే ఇలాంటి కొత్త రకం నమస్తేలు.. గిమస్తేలు కనిపెడుతున్నారు. ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "అజీబ్ నమస్తే".. "ఇదేం నమస్తే".. "వింతగా ఉండడం నీకు అలవాటయింది" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక అదా ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే 'మ్యాన్ టు మ్యాన్'.. 'బైపాస్ రోడ్' అనే చిత్రాల్లో నటిస్తోంది
Tags:    

Similar News