దర్శకత్వంలోనూ తన ముద్ర వేసిన సూపర్ స్టార్..!

Update: 2022-11-15 08:14 GMT
సూపర్ స్టార్ కృష్ణ నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. కృష్ణ దర్శకత్వంలో 16 సినిమాల దాకా వచ్చాయి. ఆయన దర్శకత్వం చేసిన మొదటి సినిమా సింహాసనం. అయితే అంతకుముందే అల్లూరి సీతారామరాజు సినిమా టైం లో సగం సినిమా పూర్తయ్యాక డైరక్టర్ రామచంద్రరావు అనారోగ్య కారణంగా మృతి చెందారు.

సగం పూర్తయిన సినిమాను కృష్ణ డైరెక్ట్ చేసి పూర్తి చేశారు. ఆ సినిమా టైటిల్స్ లో రామచంద్ర రావు పేరునే ఉంచారు కృష్ణ.

తానేం చేసినా సరే భారీగా ఉండాలని ప్రయత్నించే కృష్ణ సింహాసనం సినిమాని కూడా అదే రేంజ్ లో తెరకెక్కించారు. తెలుగులో తొలి 70 ఎం.ఎం సినిమాగా ఆ మూవీ వచ్చింది.

ఇలా ఆయన దర్శకత్వంలో ముగ్గురు కొడుకులు, శంఖారావం, నాగాస్త్రం, కొడుకు దిద్దిన కాపురం, ఇంద్రభవనం, అన్న తమ్ముడు, అల్లుడు దిద్దిన కాపురం, మానవుడు దానవుడు సినిమాలను డైరెక్ట్ చేశారు. కృష్ణ డైరెక్ట్ చేసిన ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం సినిమాల్లో మహేష్, రమేష్ బాబు కూడా నటించారు.       

ఎన్.టి.ఆర్ తో కృష్ణ చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమా టైం లో ఆ కథ ఏయన్నార్  కన్నకొడుకు సినిమా కథకు దగ్గరా ఉందని కొందరు అభిప్రాయపడగా కథను కొద్దిగా మార్చి తన దర్శకత్వ ప్రతిభ చాటారు కృష్ణ. దర్శకుడిగానే కాదు నిర్మాత కూడా ఆయన తన డేరింగ్ ని చూపించారు.

తెలుగు సినిమాకు కొత్త సాంకేతికతని తీసుకొచ్చిన ఖ్యాతి కృష్ణ గారికి సొంతం. తెలుగు సినిమా ఇవాళ ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా ఉంది అంటే అప్పట్లో కృష్ణ గారు చేసిన సాహసాలే అని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News