మెగా సుప్రీం స్టార్ సాయిధరం తేజ్ హీరోగా - రాశిఖన్నా హీరోయిన్ గా రూపొందుతున్న మూవీ సుప్రీం. కళ్యాణ్ రామ్ పటాస్ తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తామని యూనిట్ వర్గాలు గతంలో హింట్ ఇచ్చాయి. ఏప్రిల్ 8 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ తో మొదలుపెట్టి.. వరుసగా భారీ చిత్రాల రిలీజ్ లు ఉండడంతో.. ముందే సుప్రీంని తెరపైకి తెచ్చేయాలని ప్లాన్ చేశారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సుప్రీం ఈ డేట్ ని మిస్ చేస్తున్నాడని అర్ధం చేసుకోవాల్సిందే. ఏప్రిల్ 1 వచ్చేందుకు ప్రస్తుతం 15 రోజుల టైం కూడా లేదు. ఇంకా సుప్రీంకి ఆడియో కూడా విడుదల చేయలేదు. దిల్ రాజు సినిమాకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.. ప్రచారానికి కూడా అంతే ప్లాన్డ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. మరి ఇంకా ఆడియా కూడా రిలీజ్ చేయలేదు, కనీసం టీజర్ కూడా లాంఛ్ చేయలేదంటే.. ప్రమోషన్స్ పనులు మొదలు కానట్లే అర్ధం చేసుకోవాలి.
ఏప్రిల్ 1 డేట్ ని సుప్రీం మిస్ అయిపోతున్నాడనే విషయం స్పష్టమవుతోంది. ఇక ఆ నెలలో వచ్చే ఛాన్స్ ఏ మాత్రం లేదు. మే6 న అ..ఆ.. వరకే ఇప్పటివరకూ రిలీజ్ షెడ్యూల్ ఫైనల్ చేసినా.. ఆ తర్వాత మహేష్ బ్రహ్మోత్సవం విడుదల కావాల్సి ఉంది. దీనికి తోడు 'శ్రీరస్తు శుభమస్తు'తో మే నెలలో వస్తానంటూ ఇప్పటికే అల్లు శిరీష్ ఫిక్స్ అయ్యాడు. దీని తర్వాత వరకూ.. సుప్రీంకి రిలీజ్ డేట్ దొరక్కపోవచ్చు. అంటే సుప్రీం విడుదల రెండు నెలలు పోస్ట్ పోన్ అయినట్లే.