డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత సినిమాల విడుదలకు మరో కొత్త వేదిక దొరికినట్లయింది. ఇంతకముందు సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్స్ దొరికే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఓటీటీలు వచ్చాక థియేటర్స్ లో విడుదల చేయడం కుదరకపోతే డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కి ముందు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన కొన్ని రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెట్టేవారు. కానీ కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. గత ఏడున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతబడి ఉండటంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రొడ్యూసర్స్ అందరూ తమ సినిమాలను డైరెక్ట్ ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాకపోతే ఓటీటీ విడుదలకు నేచులర్ స్టార్ నాని తప్ప క్రేజ్ ఉన్న మిగతా హీరోలెవరూ ముందుకు రాలేదనే చెప్పాలి.
తెలుగులో 'అమృతరామన్' 'భానుమతి అండ్ రామకృష్ణ' 'కృష్ణ అండ్ హిజ్ లీల' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' 'జోహార్' '47 రోజుల్లో' 'ఒరేయ్ బుజ్జిగా' 'నిశ్శబ్దం' వంటి చిత్రాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల అయ్యాయి. ఈ క్రమంలో నాని - సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ 'వి' చిత్రాన్ని కూడా డిజిటల్ రిలీజ్ చేశారు. థియేటర్ మార్కెట్ ఉన్న నాని సినిమా ఓటీటీలో విడుదల కావడంతో మిగతా హీరోలందరూ ఓటీటీ బాట పడతారని అనుకున్నారు. కానీ మరే స్టార్ హీరో కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 30న విడుదల కానుంది. అక్కడ కూడా సూర్య మినహా మరో హీరో ఓటీటీ విడుదలకి రెడీగా లేడు. కేంద్రం థియేటర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అన్ని ఏరియాల్లో రీ ఓపెన్ చేయడానికి.. ప్రేక్షకులు రావడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. ఒకవేళ థియేటర్స్ పరిస్థితి ఇంకొన్ని నెలలు ఇలానే ఉంటే ఇప్పుడు సైలెంట్ గా ఉన్న హీరోలంతా ఏం చేస్తారో మరి.