ఫ్యామిలీని డిపెండ్ చేయడంలో.. దానధర్మాల్లో.. సేవాకార్యక్రమాల్లో.. ప్రజల తరపున ప్రభుత్వాల్ని నిలదీయడంలో లేదా అన్యాయాల్ని ప్రశ్నించడంలోనూ.. ఎందులోనూ తగ్గడు ఈ సింగం. మహిళా ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో అతడు. అతడు ఫ్యామిలీ సింగం గా పేరు బడ్డాడు. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ది గ్రేట్ సూర్య గురించే ఇదంతా.
సూర్య ఇటీవల ఓ విషయంలో చాలా మొండిగా ఉండడం తమిళ సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్వతహాగానే గజనీలా పట్టుదల స్వభావం అతడిది. కరోనా క్రైసిస్ కాలంలో ఒక నిర్మాతగా నష్టపోయేందుకు సూర్య సిద్ధంగా లేరు. తన సినిమాలకు ఎలాంటి నష్టం రాకుండా రిలీజ్ చేసుకోవడంలోనూ అతడు గట్టి పట్టు పడుతూ అందరిలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూడలేనంటూ ఎగ్జిబిటర్లనే వ్యతిరేకించిన సూర్య తాను నటించిన ఆకాశమే హద్దుగా (సూరరై పొట్రూ) చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలన్న పంతంతో ఉన్నాడు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో వీక్షించేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. అయినా ఇంకా సూర్యను సూటి పోటి మాటలు అంటున్నారు ఎగ్జిబిటర్లు.
ఇలా చేస్తే అతడి సినిమాల రిలీజ్ లను అంగీకరించలేం అంటూ అతడిని టార్గెట్ చేసే ఆలోచనతో ఉన్నారట. మహమ్మారీ వల్ల నష్టపోయేందుకు తాను కూడా సిద్ధంగా లేనని చెబుతూనే సూర్య ఓటీటీలతో బేరం కుదుర్చుకున్నారు. బెదిరింపుల నేపథ్యంలో అతని నిర్ణయంపై వెనక్కి వెళ్తారా అనే సందేహాలు ఇన్నాళ్లు ఉన్నాయి. అయితే సూర్య ఎక్కడా తగ్గడం లేదు. తన ముందస్తు నిర్ణయం సరైనదేనని భావిస్తున్నారట.
ఇప్పట్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి కనబడడం లేదు. థియేటర్లు తెరిచినా జనంతో కిక్కిరిసేంత లేదు. పరిమిత సామర్థ్యంతోనే థియేటర్లు తెరుచుకుంటాయి. మనుముందు థియేటర్లు ఓటీటీ ఒకేసారి విడుదలయ్యే మార్గం సుగుమం అయితే అది కొంతవరకూ ఆదుకోవచ్చేమో!