తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటించాడు. తన బర్త్ డే సందర్బంగా సూర్య ప్రకటించిన సినిమాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా జై భీమ్ సినిమా గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. జై భీమ్ సినిమా లో సూర్య లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సూర్య ను ఇప్పటి వరకు చూడని సరికొత్త పాత్రలో చూడబోతున్నందుకు ప్రేక్షకులు సంతోషంగా ఉన్నారు. పింక్ సినిమా తర్వాత లాయర్ పాత్రలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇంతకు ముందు హీరోలు లాయర్ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. కాని పింక్ రీమేక్ లు సౌత్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వరుసగా తెలుగు మరియు తమిళంలో లాయర్ పాత్రల్లో హీరోలు కనిపిస్తున్నారు.
తెలుగు మరియు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సూర్య నటిస్తున్న జై భీమ్ సినిమా కథ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రాసిందని వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియా కథనాల అనుసారం ఈ కథ చంద్రు రియల్ లైఫ్ నుండి తీసుకున్నదిగా చెబుతున్నారు. 1993 లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు న్యాయ పోరాటం చేశారు. ఆ యువతి కోసం అప్పట్లో చంద్రు చేసిన న్యాయ పోరాటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ సమయంలో మీడియాలో ప్రధానంగా చంద్రు గురించిన వార్తలు వచ్చాయట. ఇప్పుడు ఆయన పోరాటంను కాస్త కమర్షియల్ హంగులతో సూర్య హీరోగా తెరకెక్కిస్తున్నారు.
అప్పట్లో రియల్ హీరోగా చంద్రు ను అంతా కీర్తించారు. అలాంటి రియల్ హీరో పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు. తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సూర్య కెరీర్ లో మరో నిలిచి పోయే సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. సూర్య గత చిత్రం సూరారై పోట్రూ లో జీ ఆర్ గోపీనాథ్ జీవిత కథను చూపించడం జరిగింది. ఆ సినిమా ఆస్కార్ అవార్డ్ రేంజ్ కు వెళ్లింది. అలాంటి సినిమానే మళ్లీ జై భీమ్ అవుతుందని సూర్య అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.