తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సూరారై పోట్రూ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. హీరోగా నటించడంతో పాటు నిర్మాత కూడా సూర్యనే అవ్వడంతో ప్రమోషన్ విషయంలో అదనపు దృష్టిని పెట్టాడు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు నవంబర్ 12న రాబోతుంది. తెలుగులో ఆకాశమే నీ హద్దురా టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్ సందర్బంగా దర్శకురాలు సుధ కొంగర గురించి సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సుధ ప్రముఖ దర్శకుడు మణిరత్నం శిష్యురాలు అనే విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలం పాటు ఆయన వద్ద శిష్యరికం చేసిన సుధ కొంగర తెలుగు మరియు తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. కాని అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ఇప్పుడు పెద్ద సినిమాను చేసి దర్శకురాలిగా పేరు తెచ్చుకునేందుకు సిద్దం అయ్యింది. సుధా కొంగర మరియు సూర్యల పరిచయం ఈమద్య జరిగింది కాదట. మణిరత్నం దర్శకత్వంలో సూర్య కెరీర్ ఆరంభంలో యువ సినిమాను చేశాడు. ఆ సినిమా షూటింగ్ సందర్బంగా సుధాతో సూర్యకు పరిచయం అయ్యిందట.
ఒక సీన్ చేస్తున్న సమయంలో మణిరత్నం షాట్ ఓకే అన్నారు. కాని సుధ మాత్రం నా వద్దకు వచ్చి మీరు ఇంకా బెటర్ గా చేయగలరు. ట్రై చేయండి అంటూ రీ టేక్ చేయించింది. అనుకున్నట్లుగానే మరోసారి చేసింది బాగా వచ్చింది. మణిరత్నం గారిని మెప్పించినా సుధను మెప్పించడంకు నేను ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అందుకే అప్పటి నుండి ఆమెతో నా జర్నీ కొనసాగుతుంది. ఈ కథ చెప్పినప్పుడు నాకు మరో ఆలోచన లేకుండా చేయాలనిపించింది. అందుకే ఈ సినిమాను నేను సొంతంగా చేశాను అంటూ సూర్య చెప్పుకొచ్చాడు.