మాటల మాంత్రికుడితో సూర్య మంతనాలు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హైద్రాబాద్ వచ్చాడు. ఓ స్టార్ హోటల్ లో కూర్చుని టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సుదీర్ఘ మంతనాలు ఆడాడు. వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నారనే విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడ్డానికే సూర్య హైద్రాబాద్ వచ్చాడని తెలుస్తోంది.
తెలుగు - తమిళ్ రెండు భాషల్లోనూ రూపొందనున్న ప్రాజెక్ట్ పై చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని గంటలపాటు దీనిపై మాట్లాడాక.. సూర్యకు సెండాఫ్ ఇచ్చి పంపాడు త్రివిక్రమ్. ప్రస్తుతం 24 ను చేస్తున్నాడు హీరో సూర్య. ఇది ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లు ఈరోస్ ఇంటర్నేషనల్ ఇప్పటికే ప్రకటించింది. అంటే సమ్మర్ నాటికి సూర్య ఫ్రీ అయిపోతాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా ఇప్పుడు అ..ఆ.. చిత్రాన్ని ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికి దాదాపు 70శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను కూడా సమ్మర్ నాటికే విడుదల చేయాలని మాటల మాంత్రికుడు భావిస్తున్నాడు.
సూర్య - త్రివిక్రమ్ ఇద్దరూ ఒకే సమయానికి ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకోనుండడంతో.. ఆ సమయానికల్లా వీరి కాంబినేషన్ లో తీయబోయే సినిమా స్క్రిప్ట్ ను ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన తుది చర్యల కోసమే.. సూర్య హైద్రాబాద్ వచ్చాడని తెలుస్తోంది. అ..ఆ.. కంప్లీట్ అయ్యాక.. ఈ ద్విభాషా చిత్రంపై త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.